»   » తరుణ్ మళ్లీ మ్యాజిక్! ఇది నా లవ్‌స్టోరీకి అనూహ్య స్పందన

తరుణ్ మళ్లీ మ్యాజిక్! ఇది నా లవ్‌స్టోరీకి అనూహ్య స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై తరుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇది నా లవ్‌స్టోరీ'. రమేష్‌ గోపీ దర్శకులు. ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మాత. హీరో తరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. హీరో తరుణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. అనంత‌రం త‌రుణ్ పుట్టిన‌రోజును కేక్ క‌టింగ్‌తో చిత్ర‌యూనిట్ సెల‌బ్రేట్ చేసింది.

ట్రిపుల్‌ రోల్‌ లో తరుణ్.. 'ఇది నా లవ్‌స్టోరి'

ఇది నా లవ్‌స్టోరీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ ట్రైలర్ ఒక మిలియన్ వ్యూస్ (10 లక్షలు ) సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

Tarun's Idi Naa Love Story trailor get good response

ట్రైలర్‌లో కనిపించిన ప్రకారం ఇది నా లవ్‌స్టోరీ చిత్రం రెగ్యులర్‌ ప్రేమకథగా కనిపించడం లేదు. ఇందులో మూడు గెటప్స్‌లో తరుణ్ సరికొత్తగా కనిపించాడు. ఈ చిత్రంలో తరుణ్ ట్రిపుల్‌ రోల్‌ చేశాడా? లేదా మూడు షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాడా? అనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.

English summary
Idi Naa Love Story is an upcoming 2018 Telugu romantic film, produced by Prakash SV, starring Tarun and Oviya. The film is a remake of the 2013 hit Kannada film, Simple Agi Ondh Love Story. This movie's audio released on January 8th at Prasad labs on the eve of Tarun's birthday. This trailer got 1 million views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X