»   » ‘రోబో’తో పాటు ‘పులి’ని పట్టుకున్న టాక్స్‌ ఫోర్స్‌...

‘రోబో’తో పాటు ‘పులి’ని పట్టుకున్న టాక్స్‌ ఫోర్స్‌...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక కొత్త సినిమా మార్కెట్లోకి విడుదలయితే ఆ సినిమాకి సంబంధించిన పైరసీ సిడిలు జోరుగా మార్కెట్లో లభ్యమవుతాయి. తాజాగా రజనీకాంత్‌ నటించిన 'రోబో", పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'పులి" చిత్రాలతో పాటు 'డాన్‌ శ్రీను, సింహా, మర్యాద రామన్న, గాయం2, దబాంగ్‌, తకిట తకిట" చిత్రాల పైరసీ డివిడిల అమ్మకం జోరుగా సాగుతోంది. ఈ డివిడిల అమ్మకం దారులను టాస్క్‌ ఫోర్స్‌ నిన్న (05.10.2010) పట్టుకున్నారు. ఈ మధ్య రిలీజ్‌ అవుతున్న సినిమాలు బాగా పైరసీకి గురవుతుండడంతో అడిషనల్‌ డిప్యుటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పైరసీ రాకెట్‌ పై కటినంగా వ్యవహరించి సుమారు 3,000 డివిడిలను సీజ్‌ చేశారు. అందులో 700 వరకు రోబోవే ఉన్నాయని సమాచారం. ఈ డివిడిలను చెన్నై నుంచి పాండి అనే వ్యక్తి సరఫరా చేస్తుంటాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu