»   »  క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా టీమ్ 5 మూవీ

క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా టీమ్ 5 మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో హీరోగా నటించేందుకు శ్రీశాంత్ అంగీకరించాడు. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్‌కు దడ పుట్టించిన శ్రీశాంత్... నటనలోనూ అంతే చలాకితనం, అంతే పట్టుదలను చూపిస్తున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ పెయిర్ చూడముచ్చటగా ఉండనుంది.

English summary
Team India former fast bowler Sree Shanth has acted in the film Team 5. Niky Garlani paired with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu