»   » డైరక్టర్ బుగ్గలు గిల్లేస్తున్న తమన్నా (ఫొటో)

డైరక్టర్ బుగ్గలు గిల్లేస్తున్న తమన్నా (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'వూపిరి'. ఈ చిత్రం కోసం వంశీతో పనిచేయడం ఎంతో గొప్పగా ఉందని నటుడు కార్తీ తన అధికారిక ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

Great working with this guy! My director Vamsi. He keeps my energy up inspite of lots of travel and demanding sangam work. #thozha #oopiri Tamannaah

Posted by Karthi on 25 November 2015

ఆయన తమ ఎనర్జీని వివిధ రూపాల్లో నిరంతరం పెంచుతూ ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో తమన్నాతో కలిసి ఆప్యాయంగా వంశీ పైడిపల్లి బుగ్గలను గిల్లేస్తున్న ఒక ఫొటోను కార్తీ అభిమానులతో పంచుకున్నారు.

అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఊపిరి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు విడుదల తేదీని ఫైనలైజ్ చేసారు. ట్రైడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఫిబ్రవరి 5, 2016 న ఈ చిత్రం విడుదల కానుంది.

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.

Team 'Oopiri' fun time behind the scenes!

నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.

''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.

''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Karthi tweeted: " Great working with this guy! My director Vamsi. He keeps my energy up inspite of lots of travel and demanding sangam work. ‪#‎thozha‬ ‪#‎oopiri‬ Tamannaah".
Please Wait while comments are loading...