»   » మహేష్ బాబుకు ‘రుద్రమదేవి’ టీం బెస్ట్ విషెస్

మహేష్ బాబుకు ‘రుద్రమదేవి’ టీం బెస్ట్ విషెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ ఈ నెల 7న విడుదలవుతున్న నేపథ్యంలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి' టీం బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఈ మేరకు తమ అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పేర్కొన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' ఈ నెల 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ‘సెల్వందన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.


మహేష్ గత చిత్రాలు 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈరోస్ వారు ఈ సారి 'శ్రీమంతుడు' చిత్రం రైట్స్ చేజిక్కించుకున్నారు. ఓవర్ నైట్ లో జరిగిన ఈ డీల్ లో నిర్మాతలు మైత్రీ మేకర్స్, మహేష్ బాగానే లబ్ది పొందినట్లు సమాచారం. ఈ డీల్ తో నిర్మాతలు పూర్తిగా ఫ్రొపిట్ జోన్ లోకి వెళ్లినట్టే అని ట్రేడ్ వర్గాల సమాచారం.


Team ‪‎Rudhramadevi‬ tweet about Srimanthudu

ప్రీ రిలీజ్ హంగామా కూడా భారీగానే ఉంది. ఓ వైపు మహేష్ బాబు ప్రమోషన్లు అదరగొడుతున్నారు. మరో వైపు ప్రమోషన్ టీం ట్రైలర్లు, పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా హాళ్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. మహేష్ బాబు భారీ కటౌట్లు, బ్యానర్లుతో థియేటర్లను అలంకరించే పనిలో నిగమ్నమయ్యారు ఫ్యాన్స్.


సినిమా గురించి దర్శకుడు ఆ మధ్య మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
"Best Wishes to our beloved ‪‎Superstar‬ ‎MaheshBabu‬ for ‎Srimanthudu‬" Team ‪‎Rudhramadevi‬ tweeted.
Please Wait while comments are loading...