»   » కేక: 'నాన్నకు ప్రేమతో' టీజర్ ఇదిగో (వీడియో)

కేక: 'నాన్నకు ప్రేమతో' టీజర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ రోజున ( అక్టోబర్ 21) టీజర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

Teaser : Ntr's Nannaku Prematho

నిర్మాత మాట్లాడుతూ ''తండ్రీ కొడకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తారక్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. సుకుమార్‌ విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి స్పెయిన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. పండగకి ఒక రోజు ముందు విడుదలవుతున్న టీజర్‌ పండగని మరింత సందడిగా మార్చబోతోంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.


టెంపర్ చిత్రం రీసెంట్ గా ఎన్టీఆర్ చిత్రాల్లో 50 కోట్లు వసూలు చేసిన చిత్రం. ఇప్పుడీ చిత్రంలో 60 కోట్లకు టార్గెట్ చేస్తున్నారు. చిత్రం మేజర్ షూటింగ్ ..యూరోపియన్ కంట్రీస్ లో చేస్తున్నారు. చిత్రంలో కథ లండన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.


రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ చక్రవర్తి, కళ: రవీందర్‌, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, కూర్పు: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌.

English summary
NTR'S Nannaku Prematho Teaser released today as promised by makers.
Please Wait while comments are loading...