»   »  అఖిల్ బర్త్ డే స్పెషల్: అక్కినేని ఫ్యాన్స్‌కి నితిన్ కానుక!

అఖిల్ బర్త్ డే స్పెషల్: అక్కినేని ఫ్యాన్స్‌కి నితిన్ కానుక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్‌ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రేపు(ఏప్రిల్ 8) అఖిల్ పుట్టిన రోజు. అఖిల్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర నిర్మాత హీరో నితిన్ అభిమానులకు గిఫ్టు ఇవ్వబోతున్నాడని టాక్. ఆ గిఫ్టు మరేదో కాదు...ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అని అంటున్నారు.

టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ‘ప్రొడక్షన్ ఎ' గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటిస్తున్నట్లు సమాచారం.

Teaser release on Akhil’s birthday

అఖిల్ మూవీ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. అన్నపూర్ణా ఏడెకరాల్లో కుటుంబ సన్నివేశాలతో సహా కొన్ని కీలక ఘట్టాలను తీస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన ఈ చిత్ర కథకు కోన వెంకట్ - గోపీమోహన్ జంట మాటలు సమకూరుస్తున్నారు.

అఖిల్ చేస్తున్న ఈ చిత్రకథ ఒక సోషియో - ఫ్యాంటసీ అనీ, గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి'కీ దీనికీ పోలికలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు అఖిల్. వివి వినాయక్ మార్కు కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది.

English summary
On the eve of Akhil’s birthday, Nithiin is planning to release an exclusive teaser of his ‘Production A’ and the details of the teaser release shall be informed shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu