»   » అక్షయ్ కుమార్ "తీస్‌మార్ ‌ఖాన్"‌ విడుదల ఎప్పుడంటే...

అక్షయ్ కుమార్ "తీస్‌మార్ ‌ఖాన్"‌ విడుదల ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'తీస్‌మార్‌ ఖాన్‌" ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్షయ్ కుమార్ సరసన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో సింగ్‌ ఈజ్‌ కింగ్‌, బ్లూ, దే ధనాధన్‌, చిత్రాలు వచ్చాయి. ఇక ఈ చిత్రానికి ఫరాఖాన్‌ దర్శకత్వం వహించడంతో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో షారూక్‌ఖాన్‌తో ఫరాఖాన్‌ తీసిన 'ఓం శాంతి ఓం" చిత్రం విజయం సాధించింది. కొరియోగ్రాఫర్‌గా దాదాపు 80 చిత్రాలకు పైగా చేసిన ఫరాఖాన్‌ ఈ చిత్రాన్ని స్వంత నిర్మాణ సంస్థలో తానే దర్శకత్వం వహించి ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందించడం విశేషం.ఇక ఈ చిత్రం తాలూకు ప్రోమోలు, ట్రైలర్లు ఇప్పటికే అంతటా సక్సెస్ అయ్యాయి.ఇక ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌తో అక్షయ్‌ఖన్నా కూడా నటించడం విశేషం.అలాగే ఈ చిత్రంలో గెస్ట్‌ ఆర్టిస్టులుగా సల్మాన్‌ఖాన్‌, అనిల్‌కపూర్‌ నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu