»   » మహేష్‌ తో చేసిన సినిమా ప్లాప్ ఎందుకంటే: తేజ

మహేష్‌ తో చేసిన సినిమా ప్లాప్ ఎందుకంటే: తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా చిత్రం 'నిజం'కు ముందు మహేష్‌ సినిమా 'బాబి' సరిగా ఆడలేదు. అందుకే అతని మీద అంచనాలు ఉండవని మహేష్‌ని ఎంచుకొన్నా. నా సినిమా విడుదలయ్యేసరికి 'ఒక్కడు' వచ్చేసింది. దాంతోపాటు ఇమేజ్‌ పెరిగిపోయింది. 'నిజం'లో హీరోని తల్లి మాట జవదాటని తనయుడిగా చూపించాం. 'మా హీరో ఏంటి, తల్లి చెబితే హత్యలు చేయడమేంటి? తనకు తానై చేయాలి గానీ..' అనుకొన్నారు. అందుకే సినిమా ఆడలేదు. ఏం చేస్తాం అన్నారు తేజ. నాలుగేళ్ల విరామం తరవాత 'నీకు నాకు డాష్‌ డాష్‌' అంటూ తేజ మరోసారి ప్రేమకథ తో రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే అలాగే తాను స్టార్ హీరోలతో సినిమాలు తీయనని చెప్తూ... ఎందుకంటే స్టార్‌ హీరో సినిమా అనగానే జనం లెక్కలు వేసేసుకొంటారు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లూ, హీరో పరిచయ సన్నివేశాల్లో హంగామా... ఇవన్నీ ఆశిస్తారు. కథ చెప్పడానికి ఓ అరగంట మిగులుతుందంతే. ఆ అరగంట కథలో కొత్తగా ఏం చెప్తాంలే అని మళ్లీ పాత కథే తీయాల్సి వస్తుంది అన్నారు.

తన చిత్రం 'నీకు నాకు డాష్‌ డాష్‌'గురించి చెపుతూ...ఆ చిత్రం ప్రేమకథ అని చెప్పలేను... ఆ స్థాయిని దాటిన భావోద్వేగాలు ఉంటాయి. మధ్యం మాఫియా నేపథ్యంలో నడిచే కథ ఇది. ఓ ప్రేమికులు చేసిన డాష్‌ పని... వారికి ఎన్ని సమస్యలు తీసుకొచ్చింది? అనేదే కథ అన్నారు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక తేజ తన కేక చిత్రం తర్వాత ఏ చిత్రమూ చేయలేదు. ఆ మధ్యన వెంకటేష్ తో సురేష్ బ్యానర్ లో ఓ చిత్రం అనుకున్నారు. కానీ అది మెటిరీయలైజ్ కాలేదు. దాంతో అంతా కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ ఈ 'నీకు నాకు డాష్‌ డాష్‌'చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం యూత్ కి బాగా పడుతుందని అంచనాలు వేస్తున్నారు.

English summary
"It is an action packed love story set in the backdrop of liquor syndicates. It is a typical commercial entertainer loaded with action, emotion, drama, adventure and entertainment. I have tried something that has never been tried before in Telugu cinema and I am confident that it will strike a chord with the audiences," says Teja.
Please Wait while comments are loading...