»   »  'కేక' టిక్కెట్లు దొరకటం లేదు...తెలుసా!

'కేక' టిక్కెట్లు దొరకటం లేదు...తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Keka
నిండు కుండ తొణకదు...ఫ్లాఫ్ సినిమాకే పబ్లిసిటీ తప్పదు...అన్నట్లు తెలుగు సినిమా పరిస్ధితి తయారైంది. కేక సినిమాను ఓ ప్రక్క ప్రేక్షకులు చూడలేం మొర్రో అని చావు కేకలు పెడుతూంటే మరో ప్రక్క నిర్మాత,దర్శకులు తన సినిమా అంత కాదు ఇంత అంటూ ఛానెల్స్ లో ...పేపర్లలలో పబ్లిసిటీ ఓవర్ చేస్తున్నారు.
రాజా, ఇషానాలతో పాటు అధిక సంఖ్యలో కొత్తవారిని పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తేజ నిర్మించిన 'కేక' చిత్రం గురువారం భారీ ఓపెనింగ్స్‌తో విడుదలయింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన చాలా బాగుందని చిత్ర కార్యనిర్వాహక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మీడియాతో చెప్పతున్నారు.ఆయన మాటల్లోనే...స్పందన చాలా చాలా బాగుందండి. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్‌ అవడమేకాకుండా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. చాలా చోట్ల టిక్కెట్లు దొరకక వెనక్కి తిరిగి వెళ్లడం జరుగుతోంది. (అదృష్టవంతులు)

మాకు అందిన సమాచారం బట్టి యూత్‌ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా బాగుందని అన్ని ఏరియాల నుండి మాకు రిపోర్టు వచ్చింది. అయితే ఈ సినిమా చూడని వాళ్లు, తేజ అంటే గిట్టని వాళ్లు సినిమా గురించి డివైడ్‌ టాక్‌ ఉందని ప్రచారం చేస్తున్నారు. అదంతా మేం పట్టించుకోవడం లేదు.సినిమాలో విషయం ఉన్నప్పుడు ఎవరు ఎలా అంటే ఏమిటి? ప్రేక్షకులకు సినిమా నచ్చింది అంతే చాలు మాకు.(సంతోషమే కదా)

అమెరికాలోని న్యూజెర్సిలో ఈ నె ల 22న సినిమా విడుదలయింది. మన రాష్ట్రంతో పాటు చికాగో, శాన్‌ఫ్రాన్సిన్‌కో, డల్లాస్‌, డెట్రాయిట్‌ వంటి ప్రదేశాలలో గురువారం సినిమా రిలీజ్‌ అయింది. అక్కడ కూడా రెస్పాన్స్‌ బాగుంది. కొత్త తరహా చిత్రాలను అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తారని ఈ చిత్రంతో మరోసారి రుజువయింది.(నిజంగానా)సినిమా హిట్‌ అయిందని మాత్రం చెబుతాను. రేంజ్‌ ఏమిటన్నది ఇప్పుడే చెప్పను. తొలి రోజున వచ్చిన షేరే దీనికి నిదర్శనం. (అదే భ్రమలో ఉండటం మేలు)

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X