»   »  తప్పులు తెలుసుకున్నానంటున్న తేజ

తప్పులు తెలుసుకున్నానంటున్న తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Teja
నా చిత్రాల వరస ఫ్లాఫులకు రీజన్స్ కనుక్కున్నాను...ఈ సారి వాటిని రిపీట్ కానివ్వను అంటూ తేజా తన కొత్త చిత్రం కేక ప్రెస్ మీట్ లో రియలయజ్ అయ్యనట్లు మాట్లాడారు. తన సినిమాల్లో కథ ప్రతీ సారీ రిపీట్ అవుతోందని అందుకే అవి పరాజయం అవుతున్నాయని తెలుసుకున్నాను అని ఆయన చెప్పారు. అయితే ఈ సారి కథ కొత్తగా ఉంటుందని హీరో,హీరోయిన్లు కి రియల్ లైఫ్ లో కూడా పేర్లు లేవని (ఇన్నాళ్ళు ఎట్లా గడిపారో) చెప్పుకొచ్చాడు. అలాగే ఈ కొత్త హీరో హీరోయిన్లను టాలెంట్ సెర్చ్ ద్వారా పట్టుకున్నానని...(హీరో పాటల రచయిత సీతారామ శాస్త్రి గారబ్బాయని,హీరోయిన్ ముంబయి అమ్మాయి అని అంటున్నారు...అది వేరే సంగతి) చెప్పాడు. అలాగే ఈ చిత్రానికి కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుందని..పి.సి.శ్రీరామ్ కి స్క్రిప్టు మొత్తం ఇంగ్లీషులో రాసి ఇవ్వటం వలన లేటయిందని అన్నాడు. ఇక చక్రి సంగీతం కూడా కొత్తగా ఇప్పటి వరకూ వినని బాణీలు వినిపిస్తాయని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా గాంధీ జయింతి రోజున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X