»   »  తేజ రియల్ ప్రాపర్టీ రూ.250???

తేజ రియల్ ప్రాపర్టీ రూ.250???

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిత్రం, నువ్వు-నేను, జయం తదితర టీనేజ్ ప్రేమ చిత్రాలను తీసిన దర్శకుడు తేజ ఈ మధ్య దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. ఇపుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో హైటెక్ సిటీ ఎరియాలో అయిదు ఎకరాల భూమిని కొన్నట్టు సమాచారం. ఆ భూమి ఇపుడు కోట్ల వర్షం కురిపించే స్థితికి చేరుకోవడంతో తేజ సినిమాల హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వైజాగ్ లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ను నిర్మించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సినిమాల ద్వారా వచ్చిన కొద్ది మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన తేజ రూ.250 కోట్ల ఆస్తి పరుడు అయినట్టు సమాచారం.

Read more about: teja property chitram nuvvu nenu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X