దర్శకుడు తేజ నెక్స్ట్ చిత్రం ప్రకటన
నిర్మాత మాట్లాడుతూ ''ప్రేమకథలను తేజ బాగా డీల్ చేస్తాడు. అందుకే ఆయనతో ఓ ప్రేమకథాచిత్రాన్ని నిర్మించనున్నాం. ఆయన శైలిలోనే ఈ సినిమా ఉంటుంది. ప్రేమలోని గాఢతను తేజ ఇందులో ఆవిష్కరిస్తారు. హీరోహీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టి 30 రోజుల్లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 1000 అబద్ధాలు తర్వాత తేజతో మరో చిత్రం చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన శైలిలో సాగే ప్రేమకథ ఇది. ఇందులో పలువురు కొత్తతారలు నటిస్తారు. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలుపెడతాం. 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నారు''అన్నారు.
ఇక ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'చిత్రం', 'నువ్వు-నేను', 'జయం' లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు.


Click it and Unblock the Notifications












