»   » ‘టి’వాదులు మీడియాలో హైలెట్ అయ్యేందుకు ‘సింహా’ను అడ్డుకోబోతున్నారా!

‘టి’వాదులు మీడియాలో హైలెట్ అయ్యేందుకు ‘సింహా’ను అడ్డుకోబోతున్నారా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ హీరోగా నయనతార, నమిత, స్నేహాఉల్లాల్, హీరోయిన్స్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహా" ఈ నెల 30న విడుదలకు సిద్దమవుతున్న విషయం విదితమే. రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకొన్నది. అయితే బాలకృష్ణకి ఈ మధ్య షూటింగ్ లో కాలికి చిన్నపాటి దెబ్బ తగలడం వలన సర్జరీ జరగడంతో సినిమా విడుదల ఏప్రిల్ 30న ఖాయమేనా..? అనే అనుమానాలు ఫిలిం సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. కాగా ఒక్క పాటలో కొంచెం బిట్ మిగిలి వుందనీ సినిమా మొత్తం పూర్తయ్యిందనీ, ఖచ్చితంగా 30వ తేదిన సినిమాని విడుదల చేస్తామనీ దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఆర్య 2, సలీం, బిందాస్, అదుర్స్ సినిమాలపై తమ ప్రతాపం చూపిన తెలంగాణ వాదులు 'వరుడు" సినిమాని మాత్రం అంతగా పట్టించుకోలేదు. దాంతో సమ్మర్ సినిమాలపై తెలంగాణ ఎఫెక్ట్ వుండదని" చిత్ర పరిశ్రమ అంచనావేస్తున్నారు. అయితే విభజన, సమైక్య సెగల మద్య సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకొన్న వేర్సాటువాదులు, 'సింహా" చిత్రం పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సింహా భారీ చిత్రం కావడం అందులోనూ నందమూరి బాలకృష్ణ నటించడం పెద్ద విశేషం. అంటే ప్రేక్షకులను, బాలకృ అభిమానులను దృష్టిలో పెట్టుకొని సింహా చిత్రాన్ని టార్గెట్ చేస్తే మీడియాలో హైలైట్ అవుతామనే కోణంలో కొదరు తెలంగాణ వాదులు 'సింహా" సినిమాని అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. మరోప్రక్క 'అదుర్స్" సినిమా విషయంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా సినిమా పరిశ్రమపై 'టి" ఎఫెక్ట్ వుండబోదనేవారూ లేకపోలేదు. మరైతే చూద్దాం బాలయ్య సినిమా విషయంలో 'టి" ఎఫెక్ట్ సిపనిచేస్తుందో లేదో .

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu