»   » ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్’ ఏర్పాటు!

‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్’ ఏర్పాటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
telangana cinema chamber of commerce
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడంతో సినిమారంగంలోని తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక పిల్మ్ చాంబర్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతం వారిచే ఓ అసోసియేషన్ ఉన్నప్పటికీ దానికి పెద్దగా గుర్తింపు లేదు. మారిన పరిణామాల నేపథ్యంలో కొత్త చాంబర్ ఏర్పాటు చేసారు. దానికి 'తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్' అని నామకరణం చేసారు.

జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్ శంకర్‌ను చాంబర్ ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా జనరల్ సెక్రటరీగా సయిద్ రఫీ(ఇంకెన్నాళ్లు ఫేం) ఎన్నికయ్యారు. సోమవారం దాదాపు 150 మంది కమలాపురి కాలనీలో సమావేశమై చాంబర్ ఏర్పాటు గురించి చర్చించారు.

ఏపి ఫిల్మ్ చాంబర్ మాదిరిగానే....తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నాలుగు ముఖ్య విభాగాలు కలిగి ఉంటుంది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లు ఉంటారు. తెలంగాణ దర్శకుల అసోసియేషన్‌కు దర్శకుడు అల్లాని శ్రీధర్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.

దీంతో పాటు సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్ వారిచే తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైటర్స్, డాన్సర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఆఫీసర్ బేరర్స్ అసోయేషన్లు ఇప్పటి వరకు ఖరారయ్యాయి. త్వరలో మిగతావి ఖరారు కానున్నాయి.

జనరల్ సెక్రటరీ సయిద్ రఫీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సినీ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ 'ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'కు అనుబంధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సినిమా పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సినీ చాంబర్ ఆఫ్ కాంబర్స్ పని చేస్తుందని తెలిపారు.

English summary
A new film body has been formed to give a push to film industry in Telangana. At a meeting held here on Monday, members of the film fraternity belonging to Telangana announced the formation of the new body which tentatively has been named as Telangana Cinema Chamber of Commerce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu