తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మౌన దీక్ష

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇక్కడి కళాకారులకు న్యాయం జరుగుతుందని, ఇక్కడి దర్శక నిర్మాతలు సినిమాల రంగంలో నిలదొక్కుకోగలుతారని చాంబర్ లోని కొందరు సభ్యలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణకు చెందిన వారు ప్రాంతీయ వివక్షకు గురయి సరిగా అవకాశాలు అందిపుచ్చుకోలేక పోతున్నారని, పరిశ్రమలో అగ్రనటులుగా ఎదిగిన వారిలో ఈప్రాంతం నుంచి చాలా తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకనే వెనకబడి పోయారని అన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సకల జనుల సమ్మకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, తమ వంతు ఉద్యమ బాధ్యతను నిర్వహిస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











