twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ఫస్ట్‌ ఎఫెక్ట్ మహేష్ ఫ్యామిలీకే అంటూ ప్రచారం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు విజయవంతంగా పాస్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇక రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పడటమే ఆలస్యం. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన ఇతర అంశాలను పక్కన పెడితే....ఫిల్మ్ నగర్లో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ఓ వార్త చర్చనీయాంశం అయింది.

    తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి ఎఫెక్ట్ పడేది మహేష్ బాబు ఫ్యామిలీపైనే అనే ప్రచారం మొదలైంది. గత కొంతకాలంగా వివాదంలో ఉన్న పద్మాలయ స్టూడియో భూముల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. పద్మాలయ స్టూడియో భూముల్లోని కొంత భాగాన్ని నిబంధనలకు విరుద్దంగా తెగనమ్ముకున్నారని కృష్ణ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయి. అన్యాక్రాంతం అయిన ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎప్పటి నుండో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

    Telangana first on Padmalaya Studios

    అయితే సమైక్య రాష్ట్రంలో అధికార పక్షం అండదండలతో తమ పలుకుబడి ఉపయోగించి ఆ భూములను తమ చేయి జారిపోకుండా కృష్ణ ప్యామిలీ పావులుకు కదుపుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఆ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    ఇదీ పద్మాలయ స్టూడియో భూముల అసలు కథ...
    రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం 1982లో అప్పటి ప్రభుత్వం షేక్‌పేటలో 50 ఎకరాల భూమిని రాష్ట్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థకు కేటాయించారు. పరిశ్రమ ఎదగాలన్న ఉద్దేశంతో కారుచౌకగా... అంటే ఎకరా 8500 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇదే క్రమంలో నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్‌కు కూడా 9.5 ఎకరాలు కేటాయించారు. ఈ కేటాయింపులన్నీ షరతులకు లోబడే జరిగాయి.

    ఈ భూములను చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోతే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అయితే... పద్మాలయ విషయంలో కథ అడ్డం తిరిగింది. పద్మాలయా స్టూడియోస్‌కు అనుబంధంగా పద్మాలయ టెలీఫిల్మ్స్ ఏర్పడింది. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, కుమారుడు రమేశ్ బాబు తదితరులు డైరెక్టర్లుగా నెలకొల్పిన ఈ సంస్థ జీ-టెలీఫిల్మ్స్‌తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది.

    వ్యాపారంలో నష్టాలు రావడంతో పద్మాలయ టెలీఫిల్మ్స్ కష్టాల్లో పడింది. తాను పెట్టిన రూ.60 కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందిగా 'జీ' సంస్థ పట్టుబట్టింది. ఈ క్రమంలో... కృష్ణ కుటుంబం ప్రభుత్వం కేటాయించిన 9.518 ఎకరాల్లో 5.53 ఎకరాలను జీ-టెలీఫిల్మ్స్‌కు బదిలీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే... అమ్ముకుంది. అలాగే... మరో నాలుగువేల చదరపు గజాల స్థలాన్ని 8 మంది పద్మాలయ డైరెక్టర్లు తమ పేర్లపై రిజిస్టర్ చేసేసుకున్నారు. ఇలా చేతులు మారిన భూమి విలువ రూ.456 కోట్లకు పైనే!

    భూములను జీ-టెలీఫిల్మ్స్‌కు విక్రయించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. భూమిని ఎలా పరాధీనం చేస్తారంటూ అధికారులు పలు మార్లు నోటీసులు ఇచ్చారు. చివరకు జీ- సంస్థకు అమ్మిన భూమిని 2007లో వైఎస్ ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. 'ఇది ప్రభుత్వ భూమి' అని రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టారు. దీనిపై పద్మాలయా స్టూడియోస్ ప్రతినిధులు భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్‌లోని అప్పీల్ కమిషనర్ ముందుకు వెళ్లారు.

    ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తమకు అప్పగించాలని కోరారు. పద్మాలయా స్టూడియోస్ లేవనెత్తిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని... భూమిని అమ్ముకోవడంలో తప్పులేదని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు నాటి కలెక్టర్ పద్మాలయకు ఊరట కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చారు. సికింద్రాబాద్ ఆర్డీవో మ్యుటేషన్‌కు అనుమతించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి అప్పగించారు. పైకి ఇదంతా అధికారికంగా జరిగినట్లు కనిపిస్తున్నా... తెరవెనుక చాలానే జరిగింది.

    పద్మాలయా భూముల విషయంలో ఆంధ్రా నిబంధనలను వర్తింప చేశారని, తెలంగాణ నిబంధనలను అమలు చేయలేదని చెబుతూ భూములు స్వాధీనం చేసుకోవాలన్న అప్పటి కలెక్టర్ ఆదేశాలు చెల్లవని అప్పీల్ కమిషనర్ తేల్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో ఈ భూములకు ఎసరు తప్పదని అంటున్నారు.

    English summary
    
 Film Nagar discussion is that, Telangana state first on Padmalaya Studios. The issue of Padmalaya Studios is in the discussion for several months now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X