twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టి’ ఏర్పాటుతో టాలీవుడ్‌కు సమస్యలేదు : తమ్మారెడ్డి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య ఉండదని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయ పడ్డారు. విభజన నేపథ్యంలో పరిశ్రమ గురించి ఆందోళన అవసరం లేదన్నారు.

    'రాష్ట్ర విభజన ప్రభావం సినీ పరిశ్రమపై ఉంటుందని భావించడం లేదు. 1990 నుంచి హైదరాబాద్ తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. పరిశ్రమకు ప్రత్యేకమైన పాలసీలు, నిబంధనలు ఉన్నాయి. అందు వల్ల రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమకు ఏదో జరుగుతుందనే ఆందోళన అవసరం లేదు. హైదరాబాద్ నుంచి పరిశ్రమ వేరే చోటికి షిప్ట్ అవుతేనే సమస్య' అని వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన మౌళిక సదుపాయాలన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీ కృతం అయ్యాయి. సినిమా స్టూడియోలు, సినిమా ల్యాబులతో పాటు.....పరిశ్రమకు నైజాం ఏరియానే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాను హైదరాబాద్ నుంచి తరలించే అవకాశాలు లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

    మరో వైపు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు భరోసా ఇస్తున్నారు. ఎంతో మందికి జీవనాధారమైన తెలుగు సినీ పరిశ్రమను ఉంచుకుంటామే తప్ప తుంచుకోం, మరింత అభివృద్ధి పరచుకుంటాం అని టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా తెలిపారు.

    English summary
    Noted Telugu filmmaker Tammareddy Bharadwaj, who recently stepped down as the President of APFCC, believes that the formation of Telangana will not have any impact on the Telugu film industry if strict policies are taken into consideration and implemented right away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X