For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

  By Srikanya
  |

  హైదరాబాద్ : పలుమార్లు వాయిదా పడుతూ శుక్రవారం విడుదలవుతున్న 'డమరుకం' చిత్రప్రదర్శనను అడ్డుకుంటామని ఓయూ విద్యార్థి గ్రేటర్ జేఏసీ హెచ్చరించింది. చిత్రం టైటిల్ వివాదం పరిష్కారమయ్యే వరకు తెలంగాణలో ఆడనివ్వమని తెలిపింది. డమరుకం టైటిల్ నిర్మాత పవన్‌కుమార్‌గౌడ్, దర్శకుడు జిట్టా నవీన్‌కళ్యాణ్‌తో కలిసి ఓయూ విద్యార్థి జేఏసీ గ్రేటర్ అధ్యక్షుడు జహీర్‌ఖాన్ తదితరులు ఫిల్మ్ చాంబర్‌ను ముట్టడిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డమరుకం టైటిల్ అసలైన నిర్మాత పవన్,దర్శకుడు నవీన్‌కళ్యాణ్‌కు సంఘీభావంగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ సినిమా వివాదం ఇంకా పరిష్కారం కాలేదని నిర్మాత, దర్శకుడు వెల్లడించారు.

  ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

  డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు 'డ' బదులు 'ఢ' తగిలించి 'డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

  చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...నాలుగు సార్లు రిలీజ్ డేట్‌లు మారినా బయ్యర్లు తొలిరోజు ఉన్న క్రేజ్‌తోనే ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి పోటీపడి ముగ్గురు నలుగురు బయ్యర్లు వస్తున్నారు. మీడియా కూడా ఇందులోని కష్టనష్టాలను ఆలోచించి సంయమనం పాటించింది. ఎక్కడా తప్పుగా ప్రచారం చేయలేదు. నా కెరీర్‌లో ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఘటనకు ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారని తెలుసు. గత నెల రోజులుగా వారిని ఫేస్ చేయలేకపోతున్నా. వారిని కోరుతున్నది ఒకటే... 23న భారీ ఓపెనింగ్స్ తో సినిమాను భుజానికెత్తుకుని ముందుకుతీసుకెళ్ళమన్నదే అది. ఆర్.ఆర్. మూవీస్ వెంకట్‌పై నాకెలాంటి కోపం లేదు. ఆయన వస్తే మరో సినిమా కూడా చేస్తాను. ఈ సినిమాను విడుదల చేయడానికి ఆయనెంత తపనపడ్డారో నాకు తెలుసు. 'ఆటోనగర్ సూర్య'ను వారే విడుదల చేస్తారు అన్నారు.

  English summary
  Damarukam' being described as the magnum opus in Nagarjuna's career is now facing Telangana heat after it has surmounted financial problems. Young director Naveen Kalyan has claimed that the title was his and alleged that RR Movie makers, producers of the film who had earlier promised to compensate him for the title had evaded payment, as he was from Telangana.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X