twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సినిమాపై కమిటీ దుర్మార్గం-టి సభ్యుల బహిష్కరణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ఎఫ్.డి.సి కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో జైబోలో తెలంగాణ చిత్ర దర్శకుడు ఎన్. శంకర్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, ఫిల్మ్ చాంబర్ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, విజయేందర్ రెడ్డి, తదితరులను సభ్యులుగా చేర్చారు.

    అయితే కమిటీ వేయడాన్ని అల్లం నారాయణ, ఎన్. శంకర్ తో పాటు పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. కమిటీ వేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కమిటీని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసారు. కేవలం కమిటీ వేసి అందులో కొన్ని సీన్లు తొలగించినంత మాత్రాన తెలంగాణకు జరిగిన అవమానం మాసిపోదని, సినిమాను నిషేదించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.

    టీఆర్ఎస్ నేత శ్రవణ్ మాట్లాడుతూ....సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని, తెలంగాణ వ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. సినిమా మొత్తం పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా....దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలోని 12 అభ్యంతర కర సీన్లను తొలగించినట్లు ప్రకటించారు. సినిమా ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో తీయలేదని స్పష్టం చేసారు.

    కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగులు, సన్నివేశాలు..... కెసిఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ తీరును కించ పరిచే విధంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పలు చోట్ల ఈ చిత్రం రీళ్లను దగ్ధం చేయడంతో పాటు, ప్లెక్సీలు, కటౌట్లు, పోస్టులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Telangana members N Shankar, Allam Narayana to boycott Committee on Cameraman Ganga Tho Rambabu movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X