»   » సినిమా తీస్తే తెలంగాణా వారికి 40 శాతం అవకాశాలు

సినిమా తీస్తే తెలంగాణా వారికి 40 శాతం అవకాశాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఏ చిత్రం తీసినా తెలంగాణా వారికి 40 శాతం అవకాశాలు ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ పోర్స్ డిమాండ్ చేసింది. జెఎసీ కన్వీనర్ కోదండరాం ముఖ్య అతిధిగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నిన్న(సోమవారం) తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ ఫోర్స్ అనే నూతన సంస్ధ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..పెట్టుబడులతో పాటు సంప్రదాయ వారసత్వ పెత్తనానికి తోడు ప్రభుత్వ అండతో కొందరే సినిమా రంగాన్ని శాసిస్తున్నారని అన్నారు. అలాగే ఈ ఫోర్స్ కన్వీనర్ రోశంబాలు, ప్రధాన కార్యదర్శి కడగంజి శ్రీనివాస్ మాట్లాడుతూ...తెలంగాణ టెక్నిషియన్, ఆర్టిస్టులను కాపాడుకోవటం, కొత్తవారికి ప్రోత్సాహమివ్వటం, వారికి ఎటువంటి అన్యాయం జరిగినా తెలంగాణ ఫిల్మ్ ప్రొటక్షన్ ఫోర్స్ ముందుంటుందని అన్నారు. అలాగే తెలంగాణ కళాకారుల గురించి, తెలంగాణ కరువు ప్రాంతాల గురించి చిత్రపరిశ్రమ ఏ రోజూ ఒక్క స్టార్ నైట్ కూడా చెయ్యలేదని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu