»   » తెలంగాణలో తెలంగాణ పులి అభిమానులు వర్సెస్ తెలంగాణ జెఎసి

తెలంగాణలో తెలంగాణ పులి అభిమానులు వర్సెస్ తెలంగాణ జెఎసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా 'కొమరం పులి" సినిమా అత్యంత భారీయెత్తున విడుదలైంది సంగతి విదితమే. ప్రేక్షకుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన 'కొమరం పులి" సినిమా పై ఓయూ జేఎసీతో పాటు, తెలంగాణ వాదులు కన్నెర్ర జేస్తోన్న సంగతి విదితమే. టైటిల్ లోని 'కొమరం"ను తీసేసి, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణకు జై కొడితే తప్ప, తెలంగాణ లో ఎక్కడా సినిమాని ఆడనివ్వమని ఓయూ జేఏసి నేత సుమన్ హెచ్చరిస్తున్నారు.

ఈ హెచ్చరికలకు కొనసాగింపుగా, తెలంగాణలోని పలుప్రాంతాల్లో 'కొమరం పులి" సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ల వద్ద విద్యార్థి సంఘాల జేఏసి, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ నేతలు చిన్నపాటి ఆందోళనలు చేపట్టారు. పోస్టర్లు, బ్యానర్లను తగటబెట్టడంతోపాటు, థియేటర్ల యాజమాన్యాలను బెదిరించడం ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ వాదులు. అయితే, ఆల్రెడీ అన్నిథియేటర్లలోనూ రెండు మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్ పూర్తయిపోవడం చూస్తే, 'పులి" సినిమా విడుదల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.

సినిమాని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమంటూ, తెలంగాణ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలంగాణ వాదులకు హెచ్చరికలు జారీ చేస్తుండడంతో, రేపు థియేటర్ల వద్ద రణ రంగం తప్పనిసరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పటిష్టమైన భద్రత నడుమ తెలంగాణలో ఏకంగా, 200 థియేటర్లలో సినిమా విడుదలవుతోందంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఓ పక్క తెలంగాణ వాదుల హెచ్చరికలు, ఇంకోపక్క తమ అభిమాన హీరో సినిమా కోసం సంబరాలు చేసుకుంటోన్న అభిమానులు వెరసి..రేపు ఏం జరగబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Please Wait while comments are loading...