»   » షార్ట్ ఫిలిం మేకర్ గా... ఉందా మీలో సత్తా..? మీకోసమే వీళ్ళు వెతుకుతున్నారు

షార్ట్ ఫిలిం మేకర్ గా... ఉందా మీలో సత్తా..? మీకోసమే వీళ్ళు వెతుకుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా కొన్ని వందలమంది తమ తమ ఆలోచనలకి దృశ్య రూపం ఇవ్వాలి, తాను చెప్పాలకున్న కథ, చెయ్యాలనుకున్న పని, కొందరిని ప్రభావితం చేసే సంఘటన ఇలా ఏం చెప్పాలనుకున్నా ఇప్పటి యువతరానికి దొరికిన కొత్త మాధ్యమం షార్ట్ ఫిలిం, దర్శకులుగా, స్క్రిప్ట్రైటర్లుగా, నటులుగా ఎవరో ఇచ్చే అవకాశం కొపస ఎదురు చూడతం లేదు.. అంతా కలిసి ఒక టీం గా ఏర్పడటం., ఒక సినిమా తీసేయటం ఎవరి స్కిల్ల్స్ ని బట్టి వాళ్ళు తలా ఓ చెయ్యి వేసేసి తమ కలని దృశ్య రూపం లో చూసుకోవటం. అయితే వందల సంఖ్యలో యూ ట్యూబ్ లో అప్లోడయ్యే షార్ట్ ఫిల్ముల్లో ఏదో ఒకటి అద్బుతంగా ఉండొచ్చు.., కానీ గొప్ప నిర్మాణ విలివలు లేకపోవచ్చు... అలా సత్తా ఉండీ గుర్తింపు పొందలేకపోతున్నామనుకునే ఉత్సాహవంతుల కోసం రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు అంటూ ఒక ప్రయత్నం మొదలయ్యింది...

తెలంగాణ లోని ఉత్సాహవంతులయిన యువ చలనచిత్రకారులను ప్రోత్సహించేందుకు గాను కాంపస్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే కండిషన్లు లేని పోటీ ఏం బావుంటుందీ అందులోనూ చప్పగా ఇచ్చేస్తే అసలే జీవితాన్ని చాలెంజ్ గా తీసుకున్న తెలంగాణా యువతరానికి ఇది మరీ అవమానం కిందే లెక్క అనుకునే వాళ్ళూ ఉన్నారు కాబట్టి తెలంగాణ జన జీవితానికి, కళా సంస్కృతులకు చెందిన ఏదయినా అంశాన్ని తీసుకుని పది (10) నిముషాలకు మించకుండా సినిమా తీసేయ్యాలి.

Telangana state wide competition

అలా వచ్చిన సినిమాలను మాత్రమే ఈ పోటీలకు స్వీకరిస్తారు. ఉత్తమ మయిన వాటిని ప్రముఖులయిన న్యాయ నిర్ణేతల చేత ఎంపిక చేసి 'చైతన్య స్ఫూర్తి అవార్డుల్ని' అందజేస్తారు. అవార్డు కింద మేమేంటో సైటేషన్ తో పాటు, మొదటి బహుమతి గా పది వేల రూపాయలు, ద్వితీయ అవార్డుకి అయిదు వేలు, మూడవ బహుమతిగా మూడువేలు అందజేస్తారు. డిగ్రీ,ఇంజనీరింగ్,మెడికల్ విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన వారెవరియినా ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. మరికనేం తెలంగాణా...ఊరు, మనిషి, బతుకు., వెత, గోస, ఆనందం, ఉత్సవం ఇవేకాదు మీ జీవితం చుట్టూ ఉన్న ఏదో ఒక అంశాన్ని తీసుకొని బలంగా చెప్పగలిగితే చాలు.

ఆసక్తి గల వారు తమ చిత్రాల్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింకును filmcontest@scce.ac.in మెయిల్ కి పంపించవచ్చు. లేదా ఫిల్మ్ డి‌వి‌డి లను పూర్తి వివరాలతో పోస్టులో కూడా పంపవచ్చును. పూర్తి వివరాలకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి 99497 00037 నంబర్ ను సంప్రదించవచ్చును. ఫిబ్రవరి 10వ తేదీలోగా తమ ఎంట్రీల్ని పంపాల్సి ఉంటుంది. ప్రముఖ కవి సినీ విమర్శుకులు వారాల ఆనంద్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు.
రమేశ్ రెడ్డి,
filmcontest@scce.ac.in
కార్యదర్శి.చైతన్య విద్యా సంస్థలు
తిమ్మాపూర్, ఎల్.ఏం.డి. కాలనీ,
కరీంనగర్

English summary
campus film club conducting a statewide short film contest. Telangana life style and culture is the subject to all the entries. all youngsters are eligible to send their entries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu