»   » రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న పాప్ కార్న్ థియేటర్ టీమ్

రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న పాప్ కార్న్ థియేటర్ టీమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాటకం కొన్ని నిమిషాలు, లేదా కొన్ని గంటల పాటు కూడా ప్రేక్షకులని కట్టి పడేసే ప్రాచీన కళారూపం. సినిమాలు రాకముందు మొట్టమొదట మనిషి వినొదం కోసం మొదలు పెట్టుకున్న ప్రక్రియ. వీదుల్లోంచి థియేటర్లదాకా, సెట్టింగులలో, నేపథ్య సంగీతం లో సినిమాకి ఏమాత్రం తగ్గని లైవ్ షో. ఇప్పటికీ విదేశాలలో నాటకాల కోసమే ప్రత్యేక థియేటర్లుంటాయి.

మనదేశం లో కాస్త తక్కువే అయినా ఇప్పుడిప్పుడే మళ్ళీ నాటకానికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ నాటకం అనగానే సురభి లాంటి నాటక కంపెనీలూ, పౌరాణిక కథలూ, పధ్యాలూ గ్రాంధిక సంభాషణలే గుర్తుకు వస్తాయి చాలామందికి. కానీ సాంఘిక నాటకాలూ, అబ్సర్డ్, అబ్స్ట్రాక్ట్ లాంటి ప్రక్రియలతోనూ, ఒకరూ లేదా ఇద్దరు పాత్రదారులతోనే ఆధ్యంతమూ ప్రేక్షకులని కట్టి పడేసే నాటికలూ వచ్చాయ్ వస్తూనే ఉన్నాయి... ఇప్పుడు ఈ స్టేజ్ డ్రామా అంశం ఎందుకు ముందుకు వచ్చిందీ అంటే రవీంధ్ర భారతిలో జరుగుతూన్న తెలంగాణా యువ నాటకోత్సవాల్లో రోజూ మూడు నాటకాలు ప్రదర్శించబడుతున్నాయి. ఆ నాటకోత్సవాల్లో పాప్ కార్న్ థియేటర్ ఆర్టిస్ట్ లు చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది... ఆ వివరాలు....

బాకీ ఇతిహాస్:

బాకీ ఇతిహాస్:

రవీంధ్ర భారతిలో జరుగుతున్న తెలంగణా యువజన నాటకోత్సవాలలో భాగంగా ప్రదర్శింపబడుతున్న నాటకాలలో నిన్న అంటే 27 జనవరి 2017 సాయంత్రం మూడు నాటకాలు ప్రదర్శించబడ్డాయి. మొదటిది "బాకీ ఇతిహాస్" అనే బెంగాలీ నాటకాన్ని తెలుగులోకి అనువదించిన నాటకం

దావత్:

దావత్:

కాగా రెండోది రవీంధ్రనాథ్ టాగోర్ "ఫ్రీ లంచ్" కి అనువాదం. మూడోది మాత్రం తెలుగు నాటకమే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన సంగతేమిటంటే మూడు నాటకాలూ అద్బుతంగానే ఉన్నా... రెండో నాటకమైయిన ఫ్రీలంచ్ తెలుగు అనువాదం "దావత్" హాస్య ఇతివృత్తంగా వచ్చి ఆకట్టుకుంది. ఇందులో ప్రత్యే కత ఏమిటంటే

 కామెడీ టైమింగ్:

కామెడీ టైమింగ్:

తెలుగు నాటకం అంటే ఇల్లు సెట్టు, ఒక సోఫా, రెండు కుర్చీలు అనే మూస ధోరణికి స్వస్తి పలికి... రెండు టేబుల్స్, రెండు స్టూల్స్ తో, ఒకేఒక బ్లాక్ కర్టేన్ పై... సెట్ ని మార్చకుండా... లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ లు లేకుండా... కేవలం నటులందరి కామెడీ టైమింగ్ తోనే ప్రేక్షకులతో కేరింతలు కొట్టించింది.

వీళ్ళంతా యువకులే:

వీళ్ళంతా యువకులే:

మిగిలిన రెండు నాటకాలూ అద్బుతం అనిపించుకున్నా... దావత్ ఒక హ్యాంగౌట్ పెర్ఫార్మెన్స్ గా ప్రేక్షకులతో మెప్పు పొందిందిది. భారీ సెట్టింగులు లేవు, నాటకరంగంలో తలలు పండిన నటులు కారు వీళ్ళంతా యువకులే అంతా 32 ఏళ్ళ లోపువాళ్ళే... అయినా, రెండు టేబుల్స్, రెండు స్టూల్స్ తో, ఒకేఒక బ్లాక్ కర్టేన్ పై... సెట్ ని మార్చకుండా... లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్ లేకుండా... ఏక బిగిన నవ్వులతో నాటకాన్ని పండించారు.

రవీంధ్ర భారతి హాల్ :

రవీంధ్ర భారతి హాల్ :

తిరువీర్ దర్శకత్వం లో వేసిన ఈ నాటకం లో విజయ్ గా - లక్ష్మణ్ మీసాల, అజయ్ గా- తిరువీర్, పనివాడు పరమహంస గా- శ్రీనివాస్ రేణిగుంట్ల, హోటల్ బాయ్ గా- పవన్ రమేష్, టైలర్ బాయ్ గా- నిఖిల్ జాకబ్ తాటిపర్తి , రౌడీ గా- సుధాకర్ తేళ్ళ, నగల షాప్ బాయ్ - క్రాంతి కుమార్సి .ఐ.డి. - మనోజ్ ముత్యం, ప్రవీణ్ కుమార్ గోలివాడ లైటింగ్ - ప్రవీణ్ కుమార్ గోలివాడ మ్యూజిక్ - ప్రణయ్ రాజ్ వంగరి.. ఇలా ఈ యువ టీమ్ మొత్తం కలిసి రవీంధ్ర భారతి హాల్ ని కేరింతలతో హోరెత్తించారు.

ఫ్రీ లంచ్:

ఫ్రీ లంచ్:

రవీంధ్ర నాథ్ టాగోర్ రాసిన ఫ్రీ లంచ్ లో కథేమిటంటే అజయ్ విజయ్ అనే ఇద్దరు మిత్రులలో... అజయ్ విజయ్ ని తనింటికి లంచ్ కి పిలుస్తాడు.., హాయిగా తినేసి వద్దాం అనుకున్న విజయ్ చెప్పిన సమయానికే అజయ్ ఇంటికి వెళ్తాడు అయితే అక్కడ అజయ్ ఉండడు.

లంచ్ చేయకుండానే :

లంచ్ చేయకుండానే :

తన "దావత్" కోసం సరుకులు తేవటానికి వెళ్ళాడేమో అనుకున్న విజయ్ అక్కడ అజయ్ కోసం ఎదురు చూస్తూ కూచుంటాడు. ఇక అప్పుడు మొదలవుతుంది విజయ్ కి టార్చర్ ఎవరెవరో రావటం రకరకాలుగా విజయ్ తో ఆడుకోవటం..... ఇలా "దావత్" కోసం వెళ్ళిన విజయ్ చివరికి లంచ్ చేయకుండానే డబ్బులన్నీ పోగొట్టుకోని.., అక్కన్నుంచి వెళ్ళిపోతాడు... ఇలా ఆధ్యంతమూ ఫుల్ కామెడీతో సాగిన నాటకం లో ఏ హంగూ ఆర్బాటాలూ లేకుండానే కేవలం నటుల ప్రతిభ తోనే ప్రేక్షకుడి ఆకట్టుకున్నారు. నాటకానికి ఏవిధమైన సెట్టింగులూ, ఖరీదైన ప్రాపర్టీలూ అవసరం లేదని నిరూపించారు...

మంచి టైమింగ్:

మంచి టైమింగ్:

ఒకప్పుడు వీధి నాటకాలంటే యమా క్రేజ్.. కానీ క్రమంగా నాటకాలకు ఉన్న ప్రభ తగ్గిపోయి సినిమాల హవా పెరిగిపోయాక రంగస్థలం కాస్త ఢీలా పడిపోయింది. అయితే ప్రస్తుత యువతరం రంగస్థల నటనకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇదే క్రమంలో వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది పాప్ కార్న్ థియేటర్స్. తిరువీర్ అనే ఒక తెలంగాణా యువ దర్శకుడు ప్రేక్షకుల కోసం తాయారు చేసిన "ధావత్" చూసి తీరాల్సిందే. అతి తక్కువ ప్రాపర్టీ తో మంచి టైమింగ్ తో స్టేజ్ డ్రామాని ఎలా రక్తి కట్టించాలో బాగా తెలిసిన యువకులు వీళ్ళు...

English summary
The Pop corn theatres team Out standing play the skit 'dawat' at Ravindhra bharati
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu