twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏవీఎస్‌ మృతదేహానికి ప్రముఖుల నివాళి(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు, రచయిత, దర్శకుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఏవీఎస్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు ఏవీఎస్ నివాసానికి చేరుకున్నారు.

    'మా' అధ్యక్షుడు మురళీ మోహన్, నటుడు సాయి కుమార్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, అలీతో పాటు ఇతర సినీ ప్రముఖులు మణికొండలోని ఏవీఎస్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ ఏవీఎస్ లేని లోటు తీర్చలేనిదని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.

    స్లైడ్ షోలో ఏవీఎస్ భౌతికి కాయానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు...

    ఏవీఎస్

    ఏవీఎస్


    ఏవియస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన వయస్సు 57 ఏళ్లు. ఆయన నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. ఎవియస్ నటుడు మాత్రమే కాకుండా రచయిత కూడా. ఆయన తన జీవితాన్ని పాత్రికేయుడిగా ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి, ఉదయం దినపత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశారు.

    చంద్రబాబు

    చంద్రబాబు


    ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

    దాసరి నారాయణరావు

    దాసరి నారాయణరావు


    ప్రముక దర్శకుడు దాసరి నారాయణరావు ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

    అల్లు అరవింద్

    అల్లు అరవింద్


    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం


    ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

    మిస్టర్ పెళ్లాం చిత్రం ద్వారా...

    మిస్టర్ పెళ్లాం చిత్రం ద్వారా...


    ఆయన 1957 జనవరి 2వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు బాపు మిస్టర్ పెళ్లాం చిత్రం ద్వారా ఆయన హాస్యనటుడిగా పరిచయమయ్యారు. అంతకు ముందు జంధ్యాల ముద్దమందారం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఎన్టీ రామారావు శ్రీనాథ కవిసార్వభౌమలో కూడా కాసేపు కనిపించారు. మిస్టర్ పెళ్లాం చిత్రంలో నటనకు ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు.

    తెలుగు సినీ పరిశ్రమలో..

    తెలుగు సినీ పరిశ్రమలో..


    దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన సినిమా రంగంలో ఉన్నారు. మాయలోడు, శుభలగ్నం వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆయన 500కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన మూడు సార్లు మా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన పలు రచనలు కూడా చేశారు.

    టర్నింగ్ పాయింట్

    టర్నింగ్ పాయింట్


    దూరదర్శన్‌లో ప్రసారమైన ‘నవ్వితే నవ్వండి' అనే కార్యక్రమం ఏవీఎస్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ నటన నచ్చి ‘శ్రీనాథ కవిసార్వభౌమ' సినిమాలో అవకాశం ఇచ్చారు దర్శకుడు బాపు. అయితే ఆ సినిమా ప్రారంభం కాస్త లేటవ్వడంతో బాపు దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘మిస్టర్ పెళ్లాం' చిత్రంలో అవకాశం దక్కింది. ఈ సినిమాతో తుత్తి అనే డైలాగులతో ఏవీఎస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

    కుటుంబ సభ్యులు

    కుటుంబ సభ్యులు


    ఏవీఎస్ మరణంతో శోక సముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

    ఆర్ నారాయణమూర్తి

    ఆర్ నారాయణమూర్తి


    విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

    జయసుధ, జమున

    జయసుధ, జమున


    సినీయర్ నటి జయము, జయసుధ ఏవీఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

    English summary
    Noted Telugu actor-comedian A.V. Subrahmanyam, who was suffering from liver-related problems for the past few years, died at his home in this Andhra Pradesh capital Friday. He was 57.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X