»   » మహేష్, బన్నీ, బ్రహ్మీలకు హీరో రాజా ఆహ్వానం (ఫోటోలు)

మహేష్, బన్నీ, బ్రహ్మీలకు హీరో రాజా ఆహ్వానం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆనంద్, వెన్నెల లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాజా. రాజా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నైకి చెందిన అమృత అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. మార్చి 3వ తేదీన వీరి నిశ్చితార్థం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. వీరి వివాహం ఏప్రిల్ 25వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరుగనుంది.

తన పెళ్లి చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నాడు రాజా. సిని రంగానికి చెందిన ప్రముఖులందరినీ కలిసి స్వయంగా తన వివాహ ఆహ్వాన పత్రికలు అందించాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, మోహన్ బాబు, అల్లు అర్జున్, బ్రహ్మానందం, అలీ...ఇలా ప్రతి ఒక్కరినీ కలిసి ఇన్విటేషన్ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మహేష్ బాబు

మహేష్ బాబు

ప్రస్తుతం ఆగడు షూటింగులో మహేష్ బాబు బిజీగా ఉండటంతో రాజా స్వయంగా షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఇన్విటేషన్ అందించారు.

రజనీకాంత్

రజనీకాంత్

అమృత తండ్రి ఫెడ్రిక్ విన్సెంట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య అమృత, ఆమె తల్లిదండ్రులతో కలిసి రజనీకాంత్‌ను పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్లాడు రాజా.

రామానాయుడు

రామానాయుడు


ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడుకి పెళ్లి ఇన్విటేషన్ అందిస్తున్న రాజా.

మోహన్ బాబు

మోహన్ బాబు


ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తున్న హీరో రాజా.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందించిన అనంతరం రాజా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.

బ్రహ్మానందం

బ్రహ్మానందం


ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందంకు తన పెళ్లి ఇన్విటేషన్ అందిస్తున్న రాజా.

అలీకి ఇన్విటేషన్

అలీకి ఇన్విటేషన్


ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీకి తన పెళ్లి ఇన్విటేషన్ అందిస్తున్న రాజా.

వెన్నెల కిషోర్, రఘు

వెన్నెల కిషోర్, రఘు


దూకుడు సినిమా షూటింగ్ స్పాటుకు వెళ్లిన సందర్భంగా హాస్య నటుడు వెన్నెల కిషోర్, రఘులకు ఇన్విటేషన్ అందించిన రాజా

రాజా-అమృత

రాజా-అమృత


మార్చి 3వ తేదీన వీరి నిశ్చితార్థం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. వీరి వివాహం ఏప్రిల్ 25వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరుగనుంది.

English summary
Tollywood actor Raja would soon get married to Amrita, a Chennai based girlon April 25.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu