twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటు వేసిన చిరు, చరణ్, ఎన్టీఆర్, బన్నీ... మంచి వ్యక్తుల వల్లే చెడ్డ నాయకులంటూ మంచు మనోజ్!

    |

    Recommended Video

    Tollywood Stars Allu Arjun, Jr NTR Casts Their Vote In Hyderabad || Filmibeat Telugu

    దేశ వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే చాలా మంది పోలింగ్ తేదీని హాలిడేగా భావించి ఇంటికే పరిమితం అవ్వడం, ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు.

    ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్స్ అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, మనోజ్, నాని తదితరులు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు... అభిమానులు, ప్రజలు తప్పకుండా ఓటు వేసేలా ప్రేరేపిస్తున్నారు. ఓటు విషయంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

    అలా చేస్తే.. మంచి వ్యక్తులే చెడ్డ నాయకులను ఎన్నుకున్నట్లు

    ‘మంచి వ్యక్తులు ఓటు వేయక పోవడం వల్ల మన దేశంలో చెడ్డ నాయకులు ఎన్నికవుతున్నారు. దయచేసి ఓటు వేయండి.' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీటుకు మంచి స్పందన వస్తుంది. తప్పకుండా ఓటు వేస్తామంటూ అభిమానులు రిప్లై ఇస్తున్నారు.

    ఇంక్ పడిందన్న జూ ఎన్టీఆర్

    మేము ఓటు వేశాం... మరీ మీరు? అంటూ జూ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి తన వేలును జోడించి ఓ ఫోటో పోస్ట్ చేశారు.

    నాని జెంటిల్ రిమైండర్

    హీరో నాని ట్విట్టర్ ద్వారా మరోసారి అభిమానులు, ప్రజలు ఓటు వేయాలని గుర్తు చేశారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, మన ఫ్యూచర్ బావుండాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది అంటూ నాని కొన్ని రోజులుగా ఓటు విషయంలో అందరినీ చైత్య పరుస్తున్న సంగతి తెలిసిందే.

    మీ ఇష్టం వచ్చిన వారికి ఓటే వేయండి

    మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఓటేయండి కానీ తప్పకుండా ఓటేయండి. ఓటు మన హక్కే కాదు...."బాధ్యత" కూడా అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

    సైలిష్ స్టార్ అల్లు అర్జున్

    సైలిష్ స్టార్ అల్లు అర్జున్

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో తన ఓట హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ ‘ఐకాన్' టోపీతో కనిపించడం గమనార్హం. త్వరలో ఆయన వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘ఐకాన్' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

    5 సంవత్సరాలకు ఒక సారి వచ్చే అవకాశం ఓటు హక్కు వినియోగించుకోవడం.. ఇది మన భవిష్యత్తు మరియు బాధ్యత ఓటు వేసే వారికే అడిగే హక్కు ఉంటుంది. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి..

    ౼ అల్లు అర్జున్

    కీరవాణి

    ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు కీరవాణి తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ట్వీట్ చేశారు.

    సుధీర్ బాబు

    సుధీర్ బాబు ఓటు వేసిన అనంతరం ట్వీట్ చేస్తూ... నా బాధ్యత పూర్తయింది. డెమొక్రసీలోని అత్యంత ముఖ్యమైన రోజును వృధా చేయవద్దని సూచించారు.

    చిరంజీవి, రామ్ చరణ్

    మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఇద్దరూ ఓటు వేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో రామ్ చరణ్ విదేశాల్లో ఉండటం వల్ల ఓటు వేయలేక పోయిన సంగతి తెలిసిందే.

    English summary
    Telugu actors Allu Arjun, Jr NTR casting their vote in Hyderabad. "We got inked! Did you?’’ Jr NTR tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X