»   » నా అందాలకు షార్ట్ కట్ ఉండదు: ఆ రూమర్ పై స్పందించిన అనసూయ

నా అందాలకు షార్ట్ కట్ ఉండదు: ఆ రూమర్ పై స్పందించిన అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు యాంకర్లలో సుమ తర్వాత అంత పేరు తెచ్చుకుంది అనసూయే. సుమ తన మాటకారితనంతో అందరి మెప్పు పొందింది. యాంకర్ కు గ్లామర్ లుక్ తెచ్చింది మాత్రం అనసూయే. అందంతోపాటు అట్రాక్షన్ కూడా పుష్కలంగా ఉండటంతో టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. క్షణం సినిమాలో ఓ నెగిటివ్ రోల్ చేసి తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

అవన్నీ గాలి వార్తలే

అవన్నీ గాలి వార్తలే

హాట్ భామ అనసూయ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుసగుసలు మొదలు అయ్యాయి , అయితే ఈ గుసగుసలు అనసూయ చెవిన పడటంతో అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పడేసింది అంతేకాదు నేను చెప్పేది మాత్రమే నిజం దాన్ని మాత్రమే నమ్మండి అంతేకాని గాలి వార్తలను కాదు అంటూ చెప్పుకొస్తోంది ఈ భామ .

బాగా లావైపోతోందని

బాగా లావైపోతోందని

బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవలి కాలంలో అనసూయ బాగా లావైపోతోందని, నడుము సైజు విపరీతంగా పెరిగిపోయిందని, సన్నబడేందుకు ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటోందని వార్తలు వచ్చాయి.

ప్లాస్టిక్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ

ఈ వార్తపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. తన అందాల్ని మరింత మెరుగుపరుచుకునేందుకు అనసూయ ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గుచూపుతోందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. మొదట ఈ విషయాన్ని లైట్ తీసుకుంది అనసూయ. కానీ, ఆ పుకారు రోజురోజుకు ఎక్కువవడంతో పాటు.. ప్రేక్షకులు దాన్నే నిజమని భావించే స్టేజ్ కు వెళ్లిపోయారు. దీంతో ఆ పుకారుపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు అనసూయకు.

పూర్తిగా అబద్ధం

పూర్తిగా అబద్ధం

‘చాలా రోజులుగా నా గురించి ఎటువంటి వార్తలూ రాకపోయేసరికి ఇలాంటి కొత్త వార్త పుట్టించారు. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్నాననడం పూర్తిగా అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నారు. అయినా ప్లాస్టిక్‌ సర్జరీలాంటి షార్ట్‌కట్స్‌ను నేను నమ్మన'ని ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనసూయ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసింది.

English summary
"You know..they aint getting any news from me..so might as well they create! But on a serious note..NO!NEVER!!I dont believe in shortcuts", Anasuya tweeted, clarifying about it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu