Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్...! అస్సలు నమ్మలేం కానీ ఇదే నిజం... ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
బయోపిక్ ల హవా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ప్రభావం చూపింది. బాలీవుడ్ లో వరుసగా వస్తున్న నిజ జీవిత కథల ఆధారంగా వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితాలనిస్తూండటం తో ఇప్పుడు అందరి చూపూ బయో పిక్ ల మీదే ఉంది. ఒక రకంగా కథ కి కావాల్సినంత ఇన్స్పిరేషన్, నిజ జీవిత క్థ కావటం తో సామాజికాంశాలని ఎక్కువగా బేస్ చేసుకొని తీయాల్సి వస్తుంది.... ఇంకేం ఇక ప్రేక్షకులు క్యూ కట్టేస్తారు... అందుకే అందరూ ఇప్పుడు నిజ జీవిత కథలమీదే దృష్టి పెడుతున్నారు.
అదే దారిలో మొన్నటికి మొన్న తెలుగులోనూ మహానటి సావిత్రి జీవిత చరిత్రని సినిమాగా తీసే ప్రయత్నాలు మొదలయ్యాయో లేదో. అప్పుడే ఇంకో బయో పిక్ కీ తెర లేచింది.... అది కూడా ఎవరి జీవిత చరిత్రో కాదు సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దే. ఈ సినిమా పేరేంటో తెలుసా...? 'చంద్రోదయం'. అవును అందరిని ఆసక్తి ని రేకెత్తిస్తున్న ఈ సినిమా కథ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవిత కథతో ఈ సినిమా రూపొందనుంది. ఒంగోలుకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అన్నట్టు ఈ చిత్రాన్ని విజయవాడ కార్పొరేటర్ మల్లికార్జున్ నిర్మిస్తున్నాడట.. ఈవ్ సినిమా గురించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో చూడండి...

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
విజయవాడ టీడీపీ కార్పొరేటర్ కాకమాను మల్లికార్జున యాదవ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒక సినిమా తీయబోతున్నారు.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
చంద్రోదయం అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన ఏవిధంగా కష్టపడుతున్నదీ అందులో వివరిస్తారు. ఆ సినిమాకి ఒంగోలుకి చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, దర్శకత్వం వహించనున్నారు. శ్వేతార్కే క్రియేషన్స్ మణికంట బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నారు. సినిమా స్క్రిప్ట్ కూడా సిద్దం అయిపోయింది.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
ఆగస్ట్ 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఒంగోలులో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విజయవాడ, యానాం ప్రాంతాలలో జరుగుతుందని నిర్మాత మల్లికార్జున యాదవ్ చెప్పారు.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
చంద్రుని వెన్నెలని ఏవిధంగా ప్రజలందరూ ఆస్వాదిస్తారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలనని కూడా ఓటర్లు(?) అందరూ ఆస్వాదిస్తారనే ఉద్దేశంతోనే ఈ చంద్రోదయం సినిమా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆక్కటుకొనే అంశాలు ఉంటాయని దర్శకుడు చెప్పారు

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ ఎంట్రీ, రాజకీయనేతగా సిఎంగా పరిపాలనలతో పాటు చంద్రబాబులోని అన్నికోణాలను టచ్ చేస్తారని తెలుస్తోంది.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
అయితే ఇందులో హీరో పాత్ర అదే చంద్రబాబు గారి పాత్రని పోషించే నటుడు ఎవరో మాత్రం ఇంకాతెలియ లేదు..., ఇక ఆయన చుట్టూ ఉండే మిగతా పాత్రలుకూడా ఒక్కొక్కటే సెలక్ట్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఆయన మామ గారైన నందమూరి తారక రామారావు గారి పాత్రకోసం కూడా నటులని అన్వేషిస్తున్నారట.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
లోకేష్.., పాత్ర కోసం ఇప్పటికే టాలివుడ్ లోని ఒక వర్థమాన నటున్ని ఎంచుకున్నట్టు సమాచారం....

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
అయితే ఈ సినిమాలో విలన్ ఉంటాడా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు... ఒక వేళ విలన్ ఉంటే అది ఎవరన్న విశయం మీద చర్చలు బాగానే జరుగుతున్నాయి...

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
విచిత్రం ఏంటంటే బాబు మామగారైన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్, ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలయ్య సినిమా రంగంలో హీరోలుగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు.మరి బాబు రాజకీయాల్లో హీరోగా ఉండి...ఇప్పుడు తన జీవిత చరిత్రతో ఇన్‌డైరెక్టుగా తెరమీదకు రానున్నారు.

ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి చంద్రబాబేనట.....
సినిమా తెర మీదికి తెచ్చే క్రమం లో చాలా వర్క్ చేయాల్సే ఉంటుంది దాదాపు మూడు దశాబ్దాల రాజకీయాలని పరిగన లోకి తీసుకొని కథ రాసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాలో కేవలం ఆయన హీరోయిజాన్నే చూపించి వదిలేస్తారా... మిగతా విశయాలమీద కూడా దృష్టి పెడతారా అన్నది చూడాలి మరి...