For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటోలు : పోలీస్ రికార్డుల్లో సినీ తారల పుత్రరత్నాలు

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఇద్దరిని తన బాడీగార్డులతో కొట్టించడం, ఆ తర్వాత ఈ విషయం మీడియలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా కేసు మాత్రం నమోదు కాలేదు. దీని వెనక వారి డబ్బు, హోదా, పలుకుబడి ప్రభావం పనిచేసిందనేది బహిరంగ రహస్యమే.

  చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ తేజ సంగతి పక్కన పెడితే...గతంలో పలువురు అగ్ర సినీతారల పుత్రరత్నాలు కూడా వివిధ కారణాలతో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. చాలా సందర్భాల్లో పోలీసులు కేసులు నమోదు చేయడానికి సాహసించలేదు. కొన్ని సందర్భాల్లో కేసులు నమోదైనా పోలీసులు తీసుకున్న చర్యలు శూన్యం.

  సీనియర్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు, తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునపై ఆంగ్లపత్రికలో పని చేస్తున్న ఓ మహిళా విలేఖరి గత సంవత్సరం జాబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమెదైంది. డమరుకం చిత్ర విశేషాలను కవర్‌చేయడానికి వెళ్లిన తనను హీరో నాగార్జున అకారణంగా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకున్నట్లు ఇప్పటి వరకు దాఖలాలు లేవు.

  అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గత సంవత్సరం ఆగస్టు 19న రాత్రి జరిగిన సంఘటనతో మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం....మోక్షజ్ఞ ప్రయాణిస్తున్న టాటా సఫారి కారును బంజారా హిల్స్ పోలీసులు సీజ్ చేసారు. బంజారా హిల్స్ రోడ్ నెం.12 వైపు వస్తుండగా, విధి నిర్వహణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు కాపు కాసుకుని ఉన్నారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో తాగి డ్రైవ్ చేసిన వెంకట్ అనే వ్యక్తిపై కేసు నమోదే చేసారు. ఈ కేసులో పోలీసులు మోక్షజ్ఞపై ఎలాంటి కేసు నమోదు కాకుండా చేసారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

  ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు అభిరామ్ ( సురేష్ బాబు రెండో కుమారుడు) పై కొన్ని రోజుల క్రితం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రవితేజ అనే ఇంజనీర్ ఇంటిపై దాడి చేసినందుకు గాను, అతనిపై IPC 447, 223, 342, 506 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. అభిరామ్ కి ... ఇంజినీర్ రవితేజాకి మధ్య ఓ విషయంలో తలెత్తిన మనస్పర్థలే ఈ దాడికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినా పోలీసులు ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

  మోహన్ బాబు తనయుడు, హీరో మనోజ్ ఆ మధ్య మహత్ రాఘవేంద్ర అనే తమిళ నటుడిపై దాడి చేసిన సంగతి తెలసిందే. అతనిపై మహత్ ఫిర్యాదు కూడా చేసారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి కేసు నీరుగారి పోయేలా చేసారు. పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యా తీసుకోలేక పోయారు.

  నాగార్జునపై ఆంగ్లపత్రికలో పని చేస్తున్న ఓ మహిళా విలేఖరి గత సంవత్సరం జాబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమెదైంది. డమరుకం చిత్ర విశేషాలను కవర్‌చేయడానికి వెళ్లిన తనను హీరో నాగార్జున అకారణంగా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదు చేసింది.

  మనోజ్ ఆ మధ్య మహత్ రాఘవేంద్రపై దాడి చేయగా కేసు నమెదైంది. తన పలుకుబడి ఉపయోగించి కేసు నుంచి బయట పడ్డాడు మనోజ్

  రామానాయుడు మనవడు, రాణా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ పై కొన్ని రోజుల క్రితం దాడి కేసు నమెదైనా పోలీసుల చర్యలు శూన్యం

  గత సంవత్సరం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా వివాదంలో ఇరుక్కున్నాడు.

  తన కారుకు సైడ్ ఇవ్వ లేదనే కోపంతో రామ్ చరణ్ ఇటీవల ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన బాడీగార్డులతో రోడ్డుపై దాడి చేయించిన సంగతి తెలిసిందే.

  English summary
  With just days after the Jublee Hills incident with actor Ram Charan Teja, he is back to work with shooting in Mumbai. Life moves on pretty easily with the actors and actor family in Telugu Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X