twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విదేశాల్లోనూ తెలుగు సినిమాకు కష్టాలే...

    By Bojja Kumar
    |

    విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులకు తెలుగు సినిమాలంటే మహా అభిమానం. వారాంతాలు రాగానే తెలుగువారంతా ఒక చోట కలిసి సినిమా చూసి తెగ ఎంజాయ్ చేస్తారు. దీంతో తెలుగు సినిమాలకు విదేశాల్లో మంచి వసూళ్లు వచ్చేవి. కొన్ని సినిమాలు ఇక్కడ సరిగా నడవక పోయినా విదేశాల్లో మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమాలకు విదేశాల్లో పెద్ద మార్కెట్ అంటే...అమెరికానే. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగు సినిమా వ్యాపారం మసక బారుతోంది.

    మరి ఇలా ఎందుకు జరుగుతోంది? పరిశీలిస్తే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే అక్కడా నెలకొన్నాయి. పైరసీ పెరిగి పోవడం, పెరిగిన వినోద వ్యవయాన్ని ప్రేక్షుకుడు భారంగా భావించడమే ఇందుకు కారణం. అమెరికాలో సినిమా టిక్కెట్ ధర 15 నుంచి 20 డాలర్ల వరకు ఉంటోంది. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సినిమాః చూడాలంటే అన్ని ఖర్చులు కలిసి దాదాపు 100 డాలర్ల వరకు ఖర్చవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి తెలుగు ప్రేక్షకుడి మాదిరే...విదేశీ తెలుగు ప్రేక్షకుడు కూడా పైరసీ వైపే మొగ్గు చూపుతున్నాడు. థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. విడుదలైన రెండు మూడు రోజులకి నెట్‌లో వస్తుందనే భావం పెరిగి పోతోంది.

    ఇటీవల వచ్చిన పలువురు అగ్రహీరోల సినిమాలు.....భారీ అంచనాలు రేకెత్తించి తీరా థియేటర్లకు వచ్చాక నిరాశ పరిచే విధంగా ఉండటం వల్ల కూడా....బోలెడు డబ్బులు పోసి మరీ వాయించుకోవడం కంటే నెట్‌లో ఫ్రీగా చూసి సర్దుకు పోదాం అనే వాళ్లు పెరిగి పోయారు.

    English summary
    Telugu Cinema facing problems in America.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X