»   » రజనీ 'విక్రమసింహ' తెలుగు వెర్షన్ మొదలైంది

రజనీ 'విక్రమసింహ' తెలుగు వెర్షన్ మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న యానిమేషన్‌ చిత్రం 'విక్రమసింహ'. దీపికా పదుకొణే హీరోయిన్ . రజనీ కుమార్తె సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో సినిమా తెరకెక్కుతోంది. తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ విషయాన్ని సౌందర్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమిళం, జపనీస్‌ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్' తమిళ సినిమా కాదని, అంతర్జాతీయ చిత్రం అని వ్యాఖ్యానించారు ఆచిత్ర హీరోయిన్ దీపిక పదుకొనె. దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుందని, రజనీకాంత్ అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటుడని ఆమె చెప్పుకొచ్చారు.

3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్‌లా ఉంటుందని దీపిక తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు.

శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

English summary
The Telugu dubbing work for Superstar Rajinikanth’s graphics extravaganza, ‘Kochadaiyaan’, has started. The movie will be released as ‘Vikrama Simha’ in Telugu and the makers are targeting the festival of Deepavali for release. Rajinikanth has a superb following in Andhra Pradesh as well and the makers are looking to cash in on that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu