»   »  ఎన్టీఆర్‌ 'శక్తి' షూటింగ్‌ లోనూ అన్యాయమే జరిగింది

ఎన్టీఆర్‌ 'శక్తి' షూటింగ్‌ లోనూ అన్యాయమే జరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అశ్వనీదత్‌ నిర్మిస్తున్న జూ. ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'శక్తి' షూటింగ్‌ ఇటీవల బాదామిలో జరిగింది. చెన్నైకు చెందిన స్టంట్‌ శివ నేతృత్వంలో 20 మంది ఫైటర్లు పాల్గొన్నారు (ఐదుగురు కంపోజర్లు, ఐదుగురు అసిస్టెంట్లు అందులో ఉన్నారు). తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఫైటర్స్ ని కేవలం ముగ్గుర్ని మాత్రమే తీసుకున్నారు. పెద్ద హీరోల చిత్రాలలోనూ అన్యాయమే జరుగుతోంది అంటున్నారు ఫైటర్స్ అశోశియేష్ వారు. గత కొద్ది రోజులుగా ఫైటర్స్ వివాదం జరుగుతూ షూటింగ్ లు రద్దై అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఇక తమ ఈ దుస్ధితికి కారణం తెలుగు హీరోలే అంటున్నారు ఫైటర్స్ . ఇక్కడి ఆంధ్రా ఫైటర్లకు సరైన నైపుణ్యం లేదనే వంక చూపుతూ వారు మమ్మల్ని ప్రక్కన పెడుతున్నారు. తెలుగు హీరోలు ఈ విషయంలో నిర్మాత వద్ద పట్టుబడుతున్నారు. తమ చిత్రాలకు చెన్నై ఫైట్‌మాస్టర్స్‌ బాగా పనిచేస్తారని, స్కిల్స్‌ విషయంలో వారే ముందున్నారని అంటున్నారు.అయితే ఫైటర్స్ .. 'అవకాశం ఇస్తేనే కదా...తెలిసేది. 20 సంవత్సరాలుగా ఇండిస్టీని నమ్ముకుని 15 వేల కుటుంబాలు హైదరాబాద్‌లో జీవిస్తున్నాయి. తెలుగు ఇండిస్టీని నమ్ముకుని భార్యబిడ్డలతో తరలివచ్చాం. వేలాది రూపాయల సభ్యత్వం చెల్లించాం. కనీస ప్రాధాన్యత కూడా దక్కటం లేదు. కడుపు రగిలిపోతోంది' అని కార్మికులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

అలాగే నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తాజా చిత్రం 'కందిరీగ' ఉత్తరాదిలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అవకాశం కల్పించాలని అడిగాం. హైదరాబాద్‌ వచ్చాక పని కల్పిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. నాలుగురోజులు షూటింగ్‌ చార్మినార్‌ వద్ద ఇటీవల జరిపారు. మొదట చెప్పినదానికి విరుద్ధంగా మాకు అవకాశాలు రాలేదు. అన్యాయం జరిగింది. ఈ విషయం తెలిసిన ఆంధ్రా ఫైటర్లు వారిని ప్రశ్నించారు. ఆ ప్రయత్నంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది అని చెపుతున్నారు.

అలాగే రజనీకాంత్‌ 'రోబో' సినిమాకు ఫైట్‌మాస్టర్‌ పీటర్‌హేయిన్స్‌ పనిచేసారు. 200 మంది పైటర్స్ అవసరం. అందులో మనవాళ్లను తీసుకుంటామని నిర్మాత ఇక్కడ వాళ్ళను ఆహ్వానించారు. ఇక్కడ ఫైటర్స్ ప్రయాణానికి సంబంధించిన టికెట్స్‌ కూడా కొనుక్కున్నారు. అందరూ బ్యాగులు సర్దుకుని బయలుదేరుతున్న సమయంలో నిర్మాత నుంచి ఫోన్‌ వచ్చింది. హైదరాబాద్‌ ఫైటర్లతో తాను సినిమా చేయనని పీటర్‌ చెబుతున్నాడని, మీరు రావొద్దని ఆయన చెప్పటంతో వీరంతా షాక్ అయ్యారు.

అయితే కొన్ని సమయాల్లో నిర్మాత కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మేమూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇది తప్పని తెలిసినా, నివారించలేకపోతున్నారు. యూనియన్‌ ద్వారా పోరాటం చేసినా, అన్యాయం జరుగుతూనే ఉంది అంటున్నారు. ఇటీవలే ఒక సినిమాకు రూ.40 వేలు ఆంధ్రా ఫైటర్లు పొందితే, అదే సినిమాకు లక్షా ఎనభైవేలు చెన్నై ఫైటర్లకు దక్కింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu