»   » వంటగదిలో రామ్ చరణ్...మిగతా స్టార్స్ (ఫోటో ఫీచర్)

వంటగదిలో రామ్ చరణ్...మిగతా స్టార్స్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా స్టార్స్ కూడా మామూలుగా మనలాంటి వాళ్లే. వాళ్లకూ సరదాలు, కోరికలు అన్ని ఉంటాయి. ఖాళీ దొరికితే తమ హాబీలను బయిటకు తీసి ప్రదర్శిస్తూంటారు. ముఖ్యంగా వంటగదిలో మన హీరోల్లో ముఖ్యంగా రామ్ చరణ్ వంటలు చేసి తన భార్యకు పెట్టి ఎంజాయ్ చేస్తూంటాడు. ఈ విషయాన్ని ఆయన భార్య చెపుతోంది.

ఇక హీరోయిన్స్ అయితే సరేసరి..వాళ్లు కూడా ఇలా తమ వంట ప్రావీణ్యాన్ని షూటింగ్ లలో కూడా చూపెడుతూంటారు. అంతేకాదు తాము వంట చేసిన ఐటమ్స్ ని కో స్టార్స్ కు తినిపించి మురిసిపోతూంటారు. ఇక వారి బాయ్ ఫ్రెండ్స్ కి అయితే ఈ వంట తినాలంటే భలే ముచ్చటట.

వంట చేయటం గొప్పేముంది అంటే...మనం చేస్తే మామూలు...సెలెబ్రిటీలు... వాళ్లేం చేసినా వింతే, వినోదమే. తెరమీద అందచందాలతో మైమరపించే హీరో హీరోయిన్లు... వీలు దొరికితే చాలు కిచెన్‌లోకి దూరి గరిటె తిప్పుతూ తమ పాకశాస్త్ర ప్రావీణ్యం చాటుతున్నారు.

గరిట తిప్పే మన సెలబ్రేటీలు...స్లైడ్ షోలో...

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్‌చరణ్‌ తెరపై ఫైట్లూ, డాన్సులే కాదు వంటలు కూడా అదరగొడతాడని ఆయన ఇంట్లో వాళ్లు,ప్రెండ్స్ అంటూంటారు. బిజీ కాకముందు అంటే కెరీర్ ప్రారంభం రోజుల్లో అయితే ఖాళీ దొరికితే కిచెన్‌లో ప్రయోగాలు మొదలుపెట్టేవాడట. ఒక్కసారి వంటగదిలోకి అడుగుపెడితే ఏదో ఒక ఘుమఘుమలాడే వంటకంతోనే బయటకు వచ్చేవాడు. చరణ్‌ ఎక్కువగా వండేదీ, అతని వంటల్లో ఇంట్లోవాళ్లు ఎక్కువగా ఇష్టపడేదీ బిర్యానీనే. సాధారణంగా నువ్వులనూనెతో చేసిన పదార్థాలనే తినే చరణ్‌, ఇతరులకు వండి పెట్టేటప్పుడు మాత్రం అలాంటి నియమాలేవీ పాటించడు. చరణ్‌లో తనకు నచ్చిన విషయాల్లో పాకశాస్త్ర ప్రావీణ్యం కూడా ఒకటని అంటోంది ఉపాసన.

తమన్నా

తమన్నా

తెరపై అందం, అభినయంతో కుర్రకారును హుషారెత్తించే తమన్నా ఖాళీ దొరికితే వంటగదిలో గరిటె తిప్పేస్తుంటుంది. వంటలు చేయడంలో మంచి అనుభవం ఉంది. కేకు తయారు చేసిందంటే నాలుక మైమరచిపోతుందట. ఆమె కేకు ప్రావీణ్యం తెలిసిన నక్షత్రాల హోటల్‌ వాళ్లు క్రిస్‌మస్‌కు ఆమెను కేకు మిక్సింగుకు పిలుస్తుంటారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇలాగే ఓ హోటల్లో షెఫ్‌లు చూస్తుండగానే క్షణాల్లో ఆమె రుచికరమైన కేకు తయారు చేసి వారందరి చేతా తినిపించింది.

దీపికా పదుకోని

దీపికా పదుకోని

బాలీవుడ్‌లో ఇప్పుడు ఖరీదైన హీరోయిన్‌ దీపికా పడుకొనె. ఈ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సుందరికీ వంట చేయడం సరదా. వాళ్ల ఇంట్లో రసం అతిథులకు ప్రత్యేకం. దీపిికా, ఆమె తల్లి దీన్ని ఎంతో బాగా చేస్తారు. వీళ్ల ఇంట్లో రసానికి వాడే పొడికి బాలీవుడ్‌లో భలే డిమాండు ఉంది. దీనికి 'దీపికా రసం పొడి' అనే అనధికారిక బ్రాండ్‌నేమ్‌ ఉంది. బాలీవుడ్‌లో స్నేహితులు, ఆత్మీయులకు దీన్ని ఆమె కానుకగా పంపుతుంటారు. ఈ రసం రుచికి షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌కపూర్‌, ఫరాన్‌అక్తర్‌, సల్మాన్‌ఖాన్‌ లాంటి అభిమానులున్నారు. ఇక ఆమ్లెట్‌ వేయడంలో దీపికాను మించినవాళ్లు లేరట.

కాజల్

కాజల్

కళ్లతోనే హావభావాలు పలికించే కాజల్‌ భోజన ప్రియురాలు. అంతేనా పాకశాస్త్ర ప్రవీణురాలు కూడా. ఆమె షూటింగుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు లగేజీలో తప్పకుండా ఒక ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ ఉండాల్సిందే. తరచూ ఆమె తన ఆహారాన్ని తానే వండుకుంటుంది. ఇంట్లో, స్నేహితులు వస్తే గరిటె తిప్పి వారికి తన చేతివంట రుచి చూపిస్తుంటుంది. బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు వంటలను గమనించడం ఆమెకో అలవాటు. వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుని వాటిపై ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటుంది. చాక్లెట్స్‌ బాగా చేస్తుంది.

ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్

అందాల కొండ ఐశ్వర్యారాయ్‌బచ్చన్‌... గరిటె తిప్పడంలోనూ అందెవేసిన చెయ్యే. పుట్టిల్లు మంగళూరులో ఉన్నప్పుడు తల్లిని చూసి వంట చేయడం నేర్చుకుంది. ఐశ్వర్యారాయ్‌ చేతివంట రుచికి బచ్చన్‌ కుటుంబం ఫ్లాట్‌ అయిపోయింది. అభిషేక్‌ ఏమాత్రం వీలు దొరికినా శ్రీమతి వంటను మెచ్చుకోకుండా ఉండలేడు. ఆమె చేసిన హల్వా అంటే అతనికెంతో ఇష్టం. అలాగే వెజిటబుల్‌ బిర్యానీ కూడా. అమితాబ్‌ ఇంటికి వచ్చిన కోడలు తప్పనిసరిగా ఏదో ఒక స్వీటు చేసిపెట్టాలనేది వారి కుటుంబ ఆచారం. ఐశ్వర్యా వచ్చిన తొలిరోజే వంటింట్లోకి వెళ్లి కమ్మని హల్వా చేసి వడ్డించిందట.

సిద్దార్ధ

సిద్దార్ధ

యంగ్ హీరో సిద్ధూలో ఓ రొమాంటిక్‌ మేన్‌ మాత్రమే కాదు, అందరికీ తెలీని ఓ గొప్ప షెఫ్‌ దాగున్నాడు. వంట చేయడం తనకో యోగా అంటాడు సిద్ధూ. మిత్రులూ ఆత్మీయులూ ఇంటికొస్తే వారికి తన పాకశాస్త్ర సత్తా చూపకుండా ఉండడు. రొయ్యల కూర, కొబ్బరి అన్నం చేయడంలో సిద్ధహస్తుడు. నా వంట రుచి చూస్తే ఇక మరుసటి రోజు నుంచీ మా ఇంటికి భోజనానికి వచ్చేస్తారు, అంత మంచి షెఫ్‌ను నేను అంటాడు సిద్దార్థ్‌. తెలుగువారి ప్రత్యేకమైన 'గోంగూర చికెన్‌' కనిపిస్తే చాలు ఒక పట్టుపట్టకుండా వదలడు.

English summary
Ram Charan is specialist in cooking. On Sundays he used to cook for his family members. This thing was told by Upasana. She introduced Charan in new manner which we don’t know that Charan likes cooking and he will cook for her. Charan will prepare chicken biriyani very well! Daily he drinks cow milk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu