»   »  దసరాకు అన్నీ ప్రారంభాలే

దసరాకు అన్నీ ప్రారంభాలే

Posted By:
Subscribe to Filmibeat Telugu
దసరా సందర్బంగా తెలుగు సినిమాల విడుదల చెప్పుకోదగ్గ రీతిలో లేదు. దసరాకు ముందే సినిమాలు దాదాపు విడుదల అయ్యాయి. దసరా సందర్భంగా విడుదల అవుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది అతిథే. ఆ సినిమా అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైంది. సినిమాల విడుదల పక్కన పెడితే..సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాలు మాత్రం భారీగానే ఉన్నాయి.. బాలకృష్ణ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న రంగా పాండురంగా, తరుణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా, ఎన్టీఆర్ యొక్క కంత్రీ, కోడి రామకృష్ణ దర్శకత్వంలో నాగబాబు హీరోగా రూపొందనున్న కొదమసింహం, ముమైతే ఖాన్ యొక్క మంగతయారు టిఫిన్ సెంటర్, శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం, శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలోనే నరేష్ హీరోగా ఇవివి నిర్మించనున్న సినిమా, హరిష్, రాజీవ్ కనకాల సినిమాలు ప్రారంభం కానున్నాయి.

Read more about: dussera telugu cinema
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X