»   » నిర్మాత గాజుల నాగేశ్వరరావు కన్నుమూత

నిర్మాత గాజుల నాగేశ్వరరావు కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Telugu Film Producer Gajula Nageswara Rao died
హైదరాబాద్ : అనువాద చిత్రాల నిర్మాత గాజుల నాగేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు 53 ఏళ్లు. భార్య, పిల్లలు ఉన్నారు. రాఘవేంద్ర సినీచిత్ర బేనరుపై ఆయన చిత్రాలు నిర్మించేవారు.

'పోలీస్ స్టోరీ', 'సిబిఐ అరెస్ట్ వారెంట్', 'సెంట్రల్ జైల్' వంటి అనువాద చిత్రాలతో పాటు 'ఇండిపెండెన్స్ డే' పేరుతో ఒక స్ట్రెయిట్ చిత్రాన్ని కూడా మరో పార్టనర్‌తో కలసి నిర్మించారు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో అప్పుల పాలు కావాల్సి వచ్చింది.

అలాగే ఇటీవల 'నాయక్' పేరుతో తమిళ, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా పూర్తి కాకుండానే అనారోగ్యంతో కన్నుమూశారు. గాజుల నాగేశ్వరరావు మృతికి తెలుగు నిర్మాతలమండలి సంతాపం వెలిబుచ్చింది.

English summary
Yesteryear producer Gajula Nageswara Rao died at Hyderabad .The 53-year-old filmmaker, who had worked on dubbing movies was undergoing treatment for the illness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu