twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరీ సంచలనాల వనజ??

    By Staff
    |

    తెలుగు సినిమా వనజ విదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 20 నామినేషన్లు పొందిన ఈ సినిమా మరో రెండు మేజర్ నామినేషన్లకు ఎంపికయింది. విదేశీ మీడియాలో ఉత్తమ సమీక్షలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ మారు ద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ నామినీగా రెండు విభాగాలకు ఎంపికయింది.

    రజనేష్ దోమలపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఉత్తమ చిత్రాలుగా కొనియాడబడిన టు డేస్ ఇన్ ప్యారిస్, ద లుక్ అవుట్ సినిమాలకు ధీటుగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి నామినీగా ఎంపికయింది. అంతేకాదు. లస్ట్, కాషన్, ద డైవింగ్ బెల్ అండ్ ద బట్టర్ ఫ్లై సినిమాలతో పాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ పోటీ పడుతోంది. ఈ సినిమాల ప్రదర్శన ఫిబ్రవరి 23న జరుగుతుంది. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు రోజన్నమాట.

    వనజ సినిమా ఇప్పటికే 41 దేశాలలో జరిగిన 93 ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపికయింది. 20 అంతర్జాతీయ అవార్డులను పొందింది. దక్షిణ భారత గ్రామీణ వాతావరణాన్ని తలపించే కథతో రూపొందిన ఈ సినిమా సాంఘికంగా సమాజం ఎదుర్కొంటున్న రుగ్మతలను ఎత్తి చూపుతుంది. డాన్సర్ గా తన కలలను సాకారం చేసుకుందామనుకున్న ఒక యువతి ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంగా సినిమా సాగుతుంది.

    బెర్లిన్ ఫిల్మ్ ఫస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకున్న వనజ అమెరికా సినీ విశ్లేషకుల మన్ననలను పొందింది. ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ సినిమాను ఆకాశానికెత్తుతూ వార్త రాసింది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రోజర్ ఎబర్ట్ ఈ సినిమా అందమైన సినిమా అంతేకాదు ఒక ప్రత్యేకమైన సినిమా ఇదని నాలుగు స్టార్లిచ్చాడు.

    అమెరికాలో వనజ సినిమా న్యూయార్క్ సిటీలో వరుసగా ఎనిమిది వారాలుగా నడిచింది..లాస్ ఎంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలలో నెల ప్రదర్శించబడింది. డెన్వర్, పిట్స్ బర్గ్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X