twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదీ తెలుగు సినిమా దుస్ధితి

    By Staff
    |

    Tammareddy Bharadwaj
    భారత్ లో ఎక్కువ సినిమాలు తీసే పరిశ్రమగా తెలుగు సినీ పరిశ్రమ పేరుగాంచిన విషయం తెలిసిందే.అయితే అదే సమయంలో ల్యాబ్ లో మగ్గిపోతున్న సినిమాలు ఎక్కువ ఉన్న పరిశ్రమల్లో కూడా టాలీవుడ్డే నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ఆంధ్రప్రదేష్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి అంచనా ప్రకారం ఆరువందల సినిమాదాకా ల్యాబ్ లలో బయిటకు తీసుకువచ్చే నాధుడు లేక మగ్గుతూన్నాయి. వీటిలో చాలా భాగం సగం సగం పూర్తయిన సినిమాలే కావటం మరో విశేషం. రామానాయుడు,బాలాజీ,రెయిన్ బొ ల్యాబుల్లో ఈ పరిస్ధితి నెలకొంది.

    ఈ విషయాన్ని ఎమ్.విజయేంద్ర రెడ్డి(ఎపి ఫిల్మ్ ఛాంభర్ ఆఫ్ కామెర్స్ సెక్రటరీ)విశ్లేషిస్తూ..దాదాపులో తెలుగు పరిశ్రమలో తయారవుతున్న చిత్రాల్లో చాలా భాగం క్రెడిట్ మీదే నిర్మితమవుతున్నాయి. తర్వాత ఫైనాన్స్ లు దొరకక, తెచ్చిన ఫైనాన్స్ లు తీర్చలేక,ఆర్టిస్టుల రెమ్యునేషన్స్ ఇవ్వలేని పరిస్దితి నెలకొంటోంది. దాంతో ఫిల్మ్ ల్యాబ్స్ వారి రూల్ ప్రకారం (సినిమాకు సంభందం ఉన్న వారందరూ తమకేమీ బాకీలు లేవని సంతకాలు పెట్టాకే రిలీజ్ చేయాలి)వాటిని బయిటకు తేలేక రిలీజ్ చేయటం జరగటం లేదు.

    అలాగే రియల్ ఎస్టేట్ స్లంప్ లో ఉండటం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు శాపంగా మారింది. భూమ్ నడుస్తున్న రోజుల్లో చాలామంది రియల్టర్స్ సినీ పరిశ్రమలోకి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతటా ఆర్ధిక మాణ్య పరిస్ధితులు నెలకొనటం,ఐటి ఆధారిత పరిశ్రమలు కుప్పకూలటం జరగటంతో అక్కడ నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోవటంతో పూర్తిగా రియల్ రంగాన్ని కుదేలు చేసేసాయి. అంతేగాక ఇంతకు ముందులా ఎన్నారైలు కూడా సినిమాల్లో పెట్టుబడి పెట్టడం లేదు. వీటిన్నటి మించి ఏడాది ఏడాదికీ సక్సెస్ రేటు పడిపోవటం మరో కారణమైంది.ఇవన్నీ ఇలా ఉంటే చిన్న సినిమాల్లో ధియోటర్స్ కి ప్రేక్షకులను లాక్కొచ్చే స్టార్స్ లేకపోవటంతో ఓపినింగ్స్ లేకపోవటం,మౌత్ టాక్ వచ్చే లోగే సినిమా ధియోటర్ నుండి వెళ్ళిపోతోంది.ఇది మరో దెబ్బ.

    ఇక ఈ విషయంపై ఏపీ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసెడెంట్ తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చే నిర్మాతలు ఫిల్మ్ ప్రొడక్షన్ పై సరైన అవగాహన లేకపోవటమే ఈ పరిస్ధితికి ప్రత్యక్ష్య కారణమవుతున్నారని ఆయన అంటున్నారు. అలాగే ఆ నిర్మాతలు ప్రేక్షకులకు పరిచయం లేని తమ కుమారులును, మేనల్లుళ్ళలను,బావమరదులును హీరోలుగా చేస్తున్నారు. వీటిని కొనటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అలాగ మధ్యలో ఆగిన వాటి జోలికి ఎవరూ పోవటం లేదు.అయినా వాటిని ఎవరైనా డభ్బు ఖర్చు పెట్టి బయిటకు తెద్దామనుకుని షూటింగ్ ప్రారంభించినా ఆ హీరోలు వయసు దాటిపోయి షేప్ ఉండవు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు అయితే పెద్ద వాళ్ళయి పోతారు. ఆ పరిస్ధితుల్లో ఏం చేయగలం అందుకే ముందుగానే ప్లాన్ చేసుకుని దిగాలి అంటున్నారు. ఇదీ మన తెలుగు సినిమా ప్రస్తుత పరిస్ధితి..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X