»   » స్టార్ హీరో ప్రభాస్ తండ్రి కన్నుమూత

స్టార్ హీరో ప్రభాస్ తండ్రి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ప్రభాస్ తండ్రిగారైన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గురువారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్యం బాగోక హైద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఆరోగ్యం మరీ విషమం కావటంతో నేటి ఉదయం ఆయన అంతిమశ్వాస విడిచారు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజుకు భార్య శివకుమారి, ప్రభాస్, ప్రబోధ్ లతో పాటు కుమార్తె ప్రగతి ఉన్నారు.ఆయన తన సోదరుడు కృష్ణంరాజుతో కలిసి గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై 'భక్తకన్నప్ప', 'కృష్ణవేణి', 'అమరదీపం', 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలు ఈ బ్యానర్ లో రూపొందాయి. గురువారం సాయంత్రం హైద్రాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.ధట్స్ తెలుగు ఆయన మృతికి నివాళులు అర్పిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu