For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అగ్ర దర్శకుల లిస్టులో మన తెలుగమ్మాయి.. వెంట పడుతున్న స్టార్ హీరోలు

  |

  సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలి అంటే ఓపికతో పాటు కష్టపడే గుణం కూడా ఉండాలి. 24 క్రాఫ్స్ట్ ని మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎవరు ఎలాంటి మిస్టేక్ చేసినా కొన్నిసార్లు సినిమాపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇక అలాంటి కెప్టెన్సీ పోస్ట్ కు ఆడవాళ్లు న్యాయం చేయలేరు అనే విమర్శలకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది సుధ కొంగర. అమ్మయిలు కూడా భవిష్యత్తులో స్టార్ దర్శకులు అవుతారని ఆకాశం నీ హద్దురా సినిమాతో నిరూపించారు.

  సుధ అందించిన హిట్టు సినిమా

  సుధ అందించిన హిట్టు సినిమా

  లాక్ డౌన్ తరువాత ఆడియెన్స్ ని సంతృప్తిపరిచిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన సినిమాలని డిజాస్టర్స్ అని తెలిపోయాయి. అయితే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సూర్య 'ఆకాశం నీ హద్దురా' ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో సూర్య సక్సెస్ చూసి చాలా ఏళ్లవుతోంది. అగ్ర దర్శకులతో చేసినా దక్కని హిట్టు సూర్యకు సుధ ద్వారా దక్కింది.

  మీతో పని చేయాలని ఉందని..

  మీతో పని చేయాలని ఉందని..


  డెక్కన్ ఎయిర్ వేస్ ఓనర్ గోపీనాథ్ విజయాన్ని ఎంతో బావోద్వేగంతో స్ఫూర్తినిచ్చే విధంగా తెరకెక్కించిన సుధ అన్ని వర్గాల ఆడియెన్స్ గుండెల్ని టచ్ చేశారు. ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఇక స్టార్ సెలబ్రెటీలు కూడా ఆమె స్టైల్ ఆఫ్ మేకింగ్ కి ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా మీతో పని చేయాలని ఉందని ఓపెన్ గా చెప్పేశాడు.

  సుధ కొంగర ఎవరంటే..

  సుధ కొంగర ఎవరంటే..

  సుధ కొంగర మన తెలుగమ్మాయే. ఒకప్పుడు సుమన్ శెట్టి, కృష్ణభగవాన్ లతో కలిసి ఆంధ్ర అందగాడు అనే చిన్న సినిమా చేసిన సుధ పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయింది. ఆ తరువాత తమిళ్ లో ద్రోహి అనే సినిమతో ప్రశంసలు అందుకొని కొన్నేళ్ల విరామం తరువాత మాధవన్ తో సుట్రూ/ సాలా ఖాదూస్ అనే సినిమా చేసింది. తమిళ్, హిందీలో ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో తెలుగులో వెంకీతో గురు టైటిల్ తో రీమేక్ చేశారు.

  Psycho Varma: Pichodi Chetilo Rayi Song Teaser | Natti Kranthi
  ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..

  ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..


  ఇక ఇప్పుడు ఆకాశం నీ హద్దురా సినిమా హిట్టవ్వడంతో ఆమె కోసం అటు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వస్తోంది. ఇక ఇళయదలపతి విజయ్ కూడా ఆమెతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ కూడా డైరెక్ట్ గా సినిమా చేయాలని ఉందని చెప్పాడు. చూస్తుంటే సుధ కొంగర భవిష్యత్తులో నెవర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉందని చెప్పవచ్చు.

  English summary
  Vijay tweet on AakaasamNeeHaddhuRa movie.Watched it with a big gang of friends, all boys, 3 of them cried, I was just raging through the film and fired up to see the outsider make his statement 🔥 and a statement was made.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X