సుమంత్ అశ్విన్ ...'కొలంబస్' టీజర్ (వీడియో)
హైదరాబాద్: 'కేరింత' ఫేం సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన మరో కొత్త చిత్రం 'కొలంబస్'. ఈ చిత్ర టీజర్‌ను ఆదిత్య మ్యుజిక్ సంస్థ శుక్రవారం రాత్రి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ టీజర్ ని ఇక్కడ చూడండి.
ఈ చిత్రంలో శీరత్ కపూర్, మిస్తి చక్రబర్తి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వినూత్న ప్రేమ కథతో తెరకెక్కిన 'కొలంబస్'కు ఆర్.సామల దర్శకత్వం వహించగా, అశ్విన్ కుమార్ సొంత బ్యానర్‌పై నిర్మించారు.
దర్శకుడు చెబుతూ ''నిజమైన ప్రేమ కోసం ఓ యువకుడు సాగించే ప్రేమయానం ఈ కొలంబస్. ఆరు పాటలూ వినసొంపుగా ఉంటాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంద''న్నారు.

సుమంత్ ఖాతాలో చేరే మరో మంచి చిత్రం అవుతుందన్నారు బి. గోపాల్. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టే యువతరాన్ని అలరించే ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
సుమంత్ చెబుతూ ''ఇంటిల్లిపాదికీ వినోదాన్ని పంచే సినిమా'' అన్నారు.


Click it and Unblock the Notifications











