»   » ముక్కోణపు ప్రేమ కథ ( ‘హమ్‌తుమ్‌’ప్రివ్యూ)

ముక్కోణపు ప్రేమ కథ ( ‘హమ్‌తుమ్‌’ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ కథలు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. అందులోనూ కొత్త దర్శకుడు,కొత్త నటీనటులతో తీసినప్పుడు మరింత ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాగే సినిమా ఏ మాత్రం బాగున్నా యూత్ టార్గెట్ కాబట్టి కలెక్షన్స్ బాగుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసినట్లున్న 'హమ్‌తుమ్‌' ఈ రోజు విడుదల అవుతోంది.

పల్లవి (సిమ్రాన్‌ చౌదరి) ఇంజనీరింగ్‌ చదువుతుంటుంది. అదే కాలేజీలో చదువుతున్న చరణ్‌ (మనీష్‌)ని ఇష్టపడుతుంది. మనీష్‌ మాత్రం పల్లవిని ఓ స్నేహితురాలిగానే భావిస్తాడు. అతని ఇష్టాయిష్టాలు వేరు. చరణ్‌ మనసు గెలుచుకోవడానికి తనని తాను పూర్తిగా మార్చుకొంటుంది పల్లవి. మరోవైపు నుంచి నిఖిల్‌ (నిఖిల్‌ చక్రవర్తి) పల్లవిని ఇష్టపడతాడు. ఈ ముక్కోణపు ప్రేమకథ చివరికి ఏమైంది? అనేదే కథ.

Telugu Movie 'Hum Tum' Preview

దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ 'ప్రేమకథని విభిన్న కోణంలో చెప్పిన సినిమా ఇది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా తీశాం. ఆ పాయింట్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని మా నమ్మకం. అలాగే సినివూ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో లండన్‌ నుంచి వచ్చేసి ఇక్కడ చాలా వుందిని కలిశా. కొత్తలో ఉన్న ఉత్సాహం, తొందరపాటును నాకు నేనుగా గవునించా. సీనియుర్‌ నిర్మాతల నుంచి చాలా నేర్చుకున్నా. తరువాత ఈ చిత్ర నిర్మాత నన్ను పిలిచి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగిం చారు. ఈ చిత్రంతో పదివుంది టాలెంట్‌ ఉన్న ఆర్టిస్టులు పరిచయుం అవుతున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ పాల్గొన్న కామెడీ సీన్లు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. సంగీతం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. హీరో,హీరోయిన్స్ అంతా కొత్తవారే. వారందరి నటన తప్పకుండా ఆకట్టుకొంటుంది. తారలందరూ వినోదాన్ని పంచుతారు. పాటలకూ మంచి స్పందన వస్తోంది''అన్నారు.

చిత్రం: హమ్‌తుమ్‌,
సంస్థ: యాపిల్‌ స్టూడియోస్‌
నటీనటులు: మనీష్‌, సిమ్రాన్‌ చౌదరి, నిఖిల్‌ చక్రవర్తి, ఏవీఎస్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవనపు, అల్లరి సుభాషిణి, నాగినీడు, మెల్కొటే, గుండు హనుమంతరావు, నందిన, ఐశ్వర్య తదితరులు
సంగీతం: మహతి,
ఫొటోగ్రఫీ: జి.శివకుమార్,
ఎడిటింగ్: నందమూరి హరి.
నిర్మాత: ఎమ్‌. శివరామరెడ్డి
దర్శకత్వం: రామ్‌ భీమన
విడుదల: నేడే

English summary
Maneesh, Simran starer movie ‘Hum Tum’ with a U/A certificate from Censors is dressing up for a big release on 14th Feb 2014.Cinematography by G Siva Kumar. Story, screen-play and direction by Ram Bimana. M Sivarami Reddy is the producer on Apple Studios Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu