»   » అతి తెలివి తేటలు కాకపోతే...

అతి తెలివి తేటలు కాకపోతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: మన డబ్బింగ్ నిర్మాతల తీరే వేరు. వారు ఎప్పటికప్పుడు ఇన్ స్టెంట్ మార్కెట్ ని నమ్ముతూ బిజినెస్ చేస్తూంటారు. రీసెంట్ గా వర్మ దర్శకత్వంలో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రం హిట్ అవటంతో ఇప్పుడు అదే హీరో శివరాజ కుమార్ నటించిన మరో చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి వదలాలాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Telugu producers buy shivalinga kannada movie

శివలింగ టైటిల్ తో కన్నడంలో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన హర్రర్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు నుంచి వెళ్లిన నిర్మాత ఒకరు రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రాన్ని డబ్ చేసి వదలాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డబ్బింగ్ వర్క్ త్వరలో ప్రారంభం కానుంది.

Telugu producers buy shivalinga kannada movie

తెలుగులో కిల్లింగ్ వీరప్పన్ చిత్రం ఏడు నుంచి ఎనిమిది కోట్లు వరకూ బిజినెస్ చేయటంతో ఈ నిర్ణయం ఆ నిర్మాతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులోనూ హర్రర్ చిత్రాలకు తెలుగులో డిమాండ్ ఉండటం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఏ మేరకు వారు నమ్మకాలు నిజం అవుతాయో...

English summary
The success of Killing Veerappan in Telugu has opened up the market for Shivarajkumar there. His next film 'Shivalinga' has been picked up by Andhra producers to be released there in Telugu. Kannada Actor Shiva Rajkumar, Actress Vedika in the lead role. The movie is directed by P.Vasu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu