»   » హైప్ హై రేంజిలో, నాగ చైతన్య టెన్షన్ టెన్షన్.. (ఫోటోస్)

హైప్ హై రేంజిలో, నాగ చైతన్య టెన్షన్ టెన్షన్.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్లో 12వ సినిమా ఇది. అయితే ఈ చిత్రానికి ‘మజ్ను' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అఫీషియల్ గా మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఫస్ట్ లుక్, అఫీషియల్ టైటిల్ ఫిబ్రవరి 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై హైప్ హై రేంజిలో ఉంది. దీంతో నాగ చైతన్య కాస్త టెన్షన పడుతున్నాడట.

గతంలో నాగార్జున హీరోగా ‘మజ్ను' అనే సినిమా వచ్చింది. ‘ప్రేమమ్' రీమేక్ చిత్రం కూడా లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రానికి ‘మజ్ను' అనే టైటిల్ బాగా సూటవుతుందని భావిస్తున్నారు. మరి ఇదే టైటిల్ ఖరారు చేస్తారా? లేక మరేదైనా టైటిల్ ఖరారు చేసారా? అనేది ఈ నెల 19న తేలనుంది.

ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒరిజినల్ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో నటించిన వారు. మళయాలం ప్రేమంలో లెక్చరర్ పాత్ర పోషించి సాయి పల్లవి స్థానంలో శృతి హాసన్ నటిస్తోంది. సినిమాలో హృతి హాసన్ రోల్ కీలకంగా, ఎక్కువగా నిడివితో ఉంటుంది. మిగతా ఇద్దరివీ పరిమితమైన పాత్రలే.

ఆల్రెడీ మలయాళంలో రిలీజైన్ ‘ప్రేమమ్' చిత్రం సూపర్ హిట్టయింది. మళయాలం సినిమా అయినప్పటికీ తమిళం, తెలుగు, కన్నడ యూత్ ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూసేసారు. బాషతో సంబంధం లేకుండా సినిమా అందరికీ అర్థం అయ్యేలా మంచి ఫీల్ తో ఉండటమే అందుకు కారణం. సినిమాలో నవీన్ పాలీ పెర్ఫార్మెన్స్ హైలెట్..... తెలుగులో నాగ చైత్య కూడా అదే రేంజిలో చేస్తే సినిమా హిట్టవడం ఖాయం.

స్లైడ్ షోలో ప్రేమమ్ రీమేక్ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ష్...

ప్రేమమ్ రీమేక్

ప్రేమమ్ రీమేక్

నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గడ్డంతో..

గడ్డంతో..

ఒరిజినల్ వెర్షన్లో హీరో కొన్ని సీన్లలో గడ్డంతో కనిపిస్తాడు. ఇందులో నాగ చైతన్య కూడా అదే లుక్ తో కనిపించబోతున్నారు.

సేమ్ లుక్...

సేమ్ లుక్...

ప్రేమంలో... సాయి పల్లవి లెక్చరర్ పాత్రలో చీరకట్టులో డీసెంటుగా కనిపిస్తుంది. తెలుగు వెర్షన్లో కూడా శృతి హాసన్ అదే లుక్ తో కనిపించబోతోంది.

సో హాట్..

సో హాట్..

ఈ సినిమాలో శృతి హాసన్ తన హాట్ లుక్స్ తో కుర్రకారు మతి పోగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వర్కింగ్ స్టిల్స్..

వర్కింగ్ స్టిల్స్..

ప్రేమమ్ రీమేక్ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్..

నాగ చైతన్య

నాగ చైతన్య

నాగ చైతన్యకు ఈ చిత్రం ‘ఏమాయ చేసేవే' రేంజిలో హిట్టిస్తుందని అంటున్నారు.

షూటింగ్ స్పాట్లో..

షూటింగ్ స్పాట్లో..

ప్రేమమ్ రీమేక్ షూటింగ్ స్పాట్లో నాగ చైతన్య.

అనుపమ

అనుపమ

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో నాగ చైతన్య.

షూటింగ్..

షూటింగ్..

ప్రేమమ్ రీమేక్ షూటింగ్ సెట్లో నాగ చైతన్య, శృతి

మడోన్నా సెబాస్టియన్

మడోన్నా సెబాస్టియన్

ప్రేమమ్ కథ ప్రకారం అయితే....చివరకు నాగ చైతన్య మడోన్నా సెబాస్టియన్ ను పెళ్లాడతాడు.

English summary
Are you ready for the first look of Naga Chaitanya and Shruti Haasan's upcoming film, which is a remake of Malayalam blockbuster Premam? Well! The makers of the film are ready too. The first look of Chay's next, along with the official title of the film, will be unveiled on 19 February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu