For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీన స్థితిలో సినీనటి పావలా శ్యామల.. తిండిలేక.. అద్దె కట్టలేని పరిస్థితి.. కరాటే కల్యాణి అండగా...

  |

  సినిమా ప్రపంచంలో చాలా వరకు కొంతమంది జీవితాలు మొదట్లో హడావుడిగానే కనిపించినా కొన్నాళ్లకు ఊహించని విధంగా మారిపోతుంటాయి. ఎంతోమంది టాలంటేడ్ నటీనటులు చివరి రోజుల్లో కూడా ధీన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అందులో పావలా శ్యామల కూడా ఉన్నారు. కరోనా కష్ట కాలంలో ఆమె జీవితం మరీ దయనీయంగా మారింది. ఇటీవల కరాటే కల్యాణి ద్వారా ఈ విషయం అందరికి తెలిసింది.

  నటిగా మంచి గుర్తింపుతో

  నటిగా మంచి గుర్తింపుతో

  ఇప్పుడున్న ఆర్టిస్టులకంటే కూడా ఒకప్పుడు కనిపించిన జూనియర్ ఆర్టిస్టులు మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అని చెప్పవచ్చు. చేసింది చిన్న చిన్న పాత్రలే అయినా సినిమాలో అదే హైలెట్ అయ్యేలా నటించేవారు. ఇష్టం ఉన్నట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారు కాదు. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు కూడా అదే తరహాలో మంచి నటిగా కొనసాగారు. ఆమె ఒకప్పుడు బిజీ ఆర్టిస్టుగా గా ఉండేవారు.

  కుతురి పరిస్థితి కూడా..

  కుతురి పరిస్థితి కూడా..

  పావలా శ్యామల భర్త చాలా ఏళ్ళ క్రితమే యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆమెనే కూతురుని చూసుకుంటోంది. అయితే ఒకసారి కూతురు కిందపడి అనారోగ్యానికి గురయ్యింది. అప్పటి నుంచి కోలుకోవడం లేదు. ఒకవైపు కూతురి అనారోగ్యం మరోవైపు ఆర్థిక సమస్యల వలన పావలా శ్యామల కూడా అనారోగ్యానికి గురయ్యింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో ఆమెకు ఎవరు సహాయం చేయలేని పరిస్థితి ఎదురయ్యింది.

  పావలా అనే పేరు ఎలా వచ్చిందంటే?

  పావలా అనే పేరు ఎలా వచ్చిందంటే?

  పావలా శ్యామల చిన్న వయసులోనే రంగస్థల నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. పావలా అనే ఒక నాటకం ద్వారా వచ్చిన పేరును ఆమె ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అయితే తన బ్రతుకు కూడా చివరికి పావలా స్థాయికి వచ్చేస్తుందాని ఊహించలేదని ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడ్డారు.

  250 సినిమాలు.. అవార్డులు అమ్ముకొని..

  250 సినిమాలు.. అవార్డులు అమ్ముకొని..

  పావలా శ్యామల అనగానే బాబాయ్ అబ్బాయ్, బాబాయ్ హోటల్ , ఖడ్గం, ఆంధ్రవాలా, గోలిమార్ వంటి సినిమాలు ఎన్నో గుర్తొస్తాయి. 1984 నుంచి సినీ రంగంలో బిజీగా కొనసాగుతున్న శ్యామల దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అయితే చివరికి ఆమె ఆర్థిక కారణాల వల్ల ఆ అవార్డులు, రివార్డులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చారు.

  అద్దె కట్టలేని పరిస్థితి

  అద్దె కట్టలేని పరిస్థితి

  గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. ఇక డబుల్ బెడ్ రూమ్ బిల్డింగ్స్ మొదలు కాలేదని బెడ్ రూమ్ రాలేదట. ప్రస్తుతం పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని చెప్పారు.

  అండగా కరాటే కళ్యాణి

  అండగా కరాటే కళ్యాణి

  ఇక ఆమె పరిస్థితిపై స్పందించిన సీనియర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఆర్థికంగా తనవంతు సహాయం చేశారు. అలాగే ఆమెకు మా అసోసియేషన్ ద్వారా కూడా నెలకు పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. గతంలో మా ఆర్టిస్ట్ గా మెంబర్షిప్ తీసుకోకపోవడమే తన తప్పని శ్యామల అన్నారు. ఇక ప్రతి ఒక్కరు పావలా శ్యామల గారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

  English summary
  For the most part in the film world, some lives may seem rushed at first but change unexpectedly over the years. Many talented actors are living in miserable conditions even in the last days. That includes Pavala Syamala. Corona's life became very miserable during the difficult times. The matter came to the notice of everyone recently through Karate Kalyani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X