»   » ‘టెంపర్’ ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్

‘టెంపర్’ ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకతవంలో తెరకెక్కిన చిత్రం ‘టెంపర్'. శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విజయవంతంగా ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ ... టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు.

కాగా...బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. అందుకు సంబంధించిన వివరాలు ఏరియా వైజ్ ఇలా ఉన్నాయి.


Temper Area Wise Closing Collections

నైజాం - 11.45 crores
సీడెడ్ - 6.70 crores
కృష్ణ- 3.14 crores
ఈస్ట్ - 2.22 crores
వెస్ట్ - 1.75 crores
నెల్లూరు - 1.50 crores
గుంటూరు- 3.07 crores
ఆంధ్రా తెలంగాణ టోటల్ - 33.13 crores
వరల్డ్ వైడ్ గ్రాస్ - 66.75 crores
వర్లడ్ వైడ్ షేర్ - 45.46 crores


ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కొట్టారు. ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి


కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Temper movie achieved more collections till now.This movie has given a life to everyone of this crew.Junior has experienced a hit in the direction of the puri.
Please Wait while comments are loading...