»   » ‘టెంపర్’ సెన్సార్ వాయిదా పడింది

‘టెంపర్’ సెన్సార్ వాయిదా పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తికావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తుందో? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 10 సాయంత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ బయటకు రానుంది.

‘టెంపర్' మూవీ ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీగా సంఖ్యలో థియేటర్లలలో విడుదలవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 250 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

Temper Censor Postponed

ఇప్పటికే యూఎస్ఏలో 125 లొకేషన్లు ఫిక్స్ అయ్యాయి. యూకె, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర దేశాల్లో 100 లొకేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మరో 25 లొకేషన్లు రిలీజ్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ చిత్రం అత్యధిక ఓపెనింగ్స్ వసూళ్లు సాధించే చిత్రగా నిలవనుంది అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇప్పటికే టెంపర్ ఫైనల్ కాపీ సిద్ధమైంది. త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది. ఏమైనా చిన్న చిన్న మార్పులు, సీన్స్ తొలగించే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, ఫైనాన్సియర్ అయిన ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) ఇటీవల ఈ చిత్రాన్ని చూసారని, కొన్ని మార్పులు చేయడంతో పాటు, పలు సీన్లు తీసేయాలని సూచించారట. ఇంతకీ పివిపికి ఈ సినిమాకు సంబంధం ఏమిటంటారా?... ‘టెంపర్' చిత్రానికి మేజర్ ఫైనాన్సియర్ ఈయనే అని టాక్.

Temper Censor Postponed

ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపి, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియాలో వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్. ఈ ఇద్దరి హధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు. వక్కతం వంశీ అందించే కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. టెంపర్ కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఈచిత్రం అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Much to the excitement of Nandamuri fans and film lovers, Censoring of Jr NTR's most hyped flick 'Temper' got postponed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu