»   » 'టెంపర్' ఆ కారణంతో 8 కోట్లు పోగొట్టుకుంది: జగపతిబాబు

'టెంపర్' ఆ కారణంతో 8 కోట్లు పోగొట్టుకుంది: జగపతిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'టెంపర్' చిత్రం గురించి సీనియర్ నటుడు జగపతిబాబు మాట్లాడారు. ఆ చిత్రం 45 కోట్లు షేర్ వచ్చింది. అయినా మరో ఎనిమిది కోట్లు వచ్చి ఉండేవని ఆయన అంటున్నారు.

రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... తాను గనుక ..పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర కనుక చేసి ఉంటే..మరో ఎనిమిది కోట్లు నిశ్సందేహంగా వచ్చి ఉండేవని అన్నారు. ఈ విషయమై ఆయన ఓ విలువైన పాయింట్ ని కూడా చెప్పారు.


జగపతిబాబు మాట్లాడుతూ...' హీరోయిజమ్... ఎప్పుడు బాగా ఎలవేట్ అవుతుందంటే...ఓ సీనియర్ హీరో... తారక్ లాంటి ఓ స్టార్ హీరోకు సెల్యూట్ చేసినప్పుడు అన్నారు. అప్పుడు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది కోట్లు భాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టేవి " అన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Temper lost Rs 8 crore because of it!

అలాగే తనకు తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని ప్రత్యేకమైన ఛాలెంజెంగ్ రోల్స్ ఇచ్చి వినియోగించుకోవచ్చని అన్నారు. అమితాబ్, ప్రాణ్,ప్రకాష్ రాజ్ వంటివారు చేస్తున్న పాత్రలను తాను సమర్ధవంతంగా చేయగలనని చెప్పారు.


ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు సినిమా కెరీర్ ప్రస్తుతం మంచి జోరుమీదే ఉంది. హీరో పాత్రలను వదిలేసి....విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం మొదలు పట్టాక అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవలే జగపతి బాబు కూతురు వివాహం కూడా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.

English summary
In a recent interview, Jagapathi Babu declared 'Temper' would have collected a share of at least Rs 8 crore more had if he played the role of the honest Police Officer in the movie. 'Heroism would have been elevated to a whole new level if a Senior Hero declines to salute a Star Hero like Tarak and then salute him later. Surely, It would have raised the figure by Rs 7-8 crore".
Please Wait while comments are loading...