»   » ‘టెంపర్’ రి రిలీజ్: కలిసొస్తుందా...?

‘టెంపర్’ రి రిలీజ్: కలిసొస్తుందా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఫిబ్రవరి 13న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల లిస్టులో చేరడంతో పాటు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 5 వారం హైదరాబాద్, బెంగుళూరుల్లోని 15 థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదల సమయంలో ఈ థియేటర్లలో సినిమా వేయడంతో పాటు మధ్యలో తీసేసి వేరే సినిమా వేసారు. మళ్లీ ఇపుడు ఆ థియేటర్లలో టెంపర్ రి రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది. కొత్తగా కొన్ని కామెడీ సీన్లు కూడా యాడ్ చేస్తున్నారు. సీన్లు యాడ్ చేయడం వసూళ్ల పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.


‘టెంపర్' చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి. నిర్మాతకు లాభాలు మిగిలాయి. అయితే ఈ చిత్రానికి గాను ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ మాత్రం లాస్ అయ్యాడని అంటున్నారు.


Temper re-releasing in 15 theaters

ఈ చిత్రానికి సంబంధించిన వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2.25 కోట్లకు పూరి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకు మొత్తం రూ. 1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక వసూళు చేసే పరిస్థితి లేదని, ఆ ఏరియాలో ‘టెంపర్' బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్లే అని అంటున్నారు. దీంతో పూరికి రూ. 75 లక్షల నష్టం వాటిల్లిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని దాదాపు 1 కోటి లాస్ అని అంటున్నారు.


కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Jr NTR’s Temper movie released on February 13th, 2015 received good appreciations for its unique content. The latest news is that nearly 15 screens are adding for Temper in its 5th week in Hyderabad and Bangalore.
Please Wait while comments are loading...