twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓంకార్ సూపర్ హిట్ 'ఆట' షో కు ఇదే క్లైమాక్స్?

    By Srikanya
    |

    జీ తెలుగులో 'ఆట' ప్రోగ్రామ్‌ ద్వారా పాపులర్‌ అయిన యాంకర్‌ ఓంకార్‌ ఇబ్బందుల్లో పడ్డారు. గత శుక్రవారం రియాల్టీ షోలను రద్దు చేయాలని పలు ప్రజాసంఘాలు చేసిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుంటూ మానవ హక్కుల కమీషన్ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి ఆటని బ్యాన్ చేయటానికి నిర్ణయంచారని సమాచారం. అలాగే పిల్లల భవిష్యత్ ని డ్యామేజ్ చేసే రియాల్టిషోలపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఓంకార్...తమ షోలో పాల్గొన్న పిల్లల తల్లితండ్రలనుంచి సపోర్టు తీసుకుని ఈ సమస్యనుంచి బయిటపడాలని చూసారు.

    ఈ సందర్భంగా కలిసిన రియాల్టీ షోలలో పాల్గొంటున్న చిన్నారుల తల్లిదండ్రులు లపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఆ ప్రదర్శనలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ షోలకు పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల తీరునూ తప్పుపట్టింది. పసి పిల్లల బాల్యాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారా..? అని వారిని నిలదీసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ‌లో పిటిషన్‌ దాఖలు చేసారు. అలాగే ఐక్యరాజ్య సమితి అధికార పత్రం నిబంధనల ప్రకారం పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడించాలి. పౌష్టికాహారాన్ని అందించాలి. ఈతరం తల్లిదండ్రులు తమ పిల్లల్ని అనారోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారు. రియాల్టీ షోలకు తీసుకెళుతున్నారు. ఇంట్లో కంప్యూటర్‌ గేమ్‌లు ఆడిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తినిపిస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా? మీరు పిల్లలతో చేయిస్తున్నది శాస్త్రీయ నృత్యాలా? డాన్స్‌ అంటే కూచిపూడి, భరతనాట్యం వంటివి. మీ పిల్లల్ని ఎప్పుడైనా ఫతేమైదాన్‌ కు, రవీంద్రభారతి వంటి వేదికల దగ్గరకు తీసుకెళ్లారా? అసలు అంత సమయం మీకుందా? మీరిచ్చిన ఫిర్యాదుపై కూడా మేం స్పందిస్తాం.

    ఈ రియాల్టీ షోలు ఏ చట్టపరిధిలోకి వస్తాయో, ఎవర్ని ప్రశ్నించాలో పరిశీలిస్తున్నాం. మా పరిధిలోకి వస్తే రియాల్టీ షోలను నిలిపివేస్తాం. 'య' కల్చర్‌ను మరిచిపోండి. మనదైన సంప్రదాయాన్ని అనుసరించండి. తల్లిదండ్రులు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే పసిపిల్లలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల్ని పెంచే పద్ధతి మాత్రం ఇది కాదు. అన్ని విషయాలు పరిశీలించి రియాల్టీ షోలపై ఈనెల 28న నిర్ణయం ప్రకటిస్తామని జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రత్యేక కమిటీ వేస్తామని, టీవీ ఛానళ్ల యాజమాన్యాలను పిలిపించి చర్చిస్తామని వెల్లడించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X